Wednesday, September 22, 2021

అమ్మా నాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది అంటూన్న ఐదేళ్ళ చిన్నారి

అమాయకమైన మొహము తో కనిపిస్తున్న ఈ రెండు జళ్ళ చిన్నారి పాప పేరు సోఫీ క్రూజ్ నిన్నటి వరకు ఎవరికీ తెలియదు. ఈరోజు ప్రధాన చానళ్లలో, పేపర్లలో, సోఫీ సాహసం కనిపిస్తోంది.. వినిపిస్తోంది. మెక్సికో నుంచి అమెరికాకు వలస వచ్చిన శరణార్థి రౌల్ క్రూజ్ కుమార్తె సోఫీ క్రూజ్. కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ డీసీకి తనవారితో కలిసివచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది క్యాథలిక్కుల గురువు పోప్ ఫ్రాన్సిస్. కనీసం ఆయన దృష్టికైనా శరణార్ధుల సమస్యను తీసుకెళితే పరిష్కారం వస్తుందని పోప్ కాన్వాయ్ వాషింగ్టన్ వీధుల గుండా సాగుతోంది. దారి పొడవునా నిలబడ్డ వేలాది మంది పోప్ ను దర్శించుకోవాలని ఆరాటం తో వేచిచూస్తున్నారు. ఇంతలో సోఫీ తనకన్నా ఎత్తు ఉన్న బారికేడ్లను దూకేసింది.

ఆమెను అడ్డుకున్న సెక్యూరిటీని వారించి దగ్గరగా పిలిచుకొని దీవించాడు. ఒక లెటర్ ను అందించింది. అందులో సోఫీ ఇలా తన మాటను రాసింది. నేను మీకొక విషయం చెప్పదలచుకున్నాను. నా హృదయం భారంగా, బాధతో ఉంది. మీరు కాంగ్రెస్ అధ్యక్షుడితో మాట్లాడండి.అమ్మానాన్నలు ఇక్కడ ఉండేందుకు అనుమతి ఇవ్వమని అడగండి.. మా అమ్మానాన్నలను నా నుంచి దూరం చేస్తారేమో అనే భయం నన్ను నిత్యం వెంటాడుతోంది. తర్వాత మీడియా ఇంటర్వ్యూల్లో కూడా సోఫీ మౌలికమైన ప్రశ్నలనే లేవనెత్తింది. అమ్మానాన్నలతో కలిసి జీవించే హక్కు నాకుంది. నేను సంతోషంగా జీవించే హక్కు కూడా నాకు ఉంది. తన కూతురు చేసిన పనికి తనకు గర్వంగా సంతోషంగా ఉందని రౌల్ పొంగిపోతున్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఈ విషయమై స్పందిస్తారని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు.

Latest Articles