ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జగన్

0
8291

అధికారంలోకి అలా వచ్చాడో లేదో.. ముఖ్యమంత్రి జగన్ దూసుకుపోతున్నాడు. అధికారంలోకి వచ్చిన నెల రోజులకే తనదైన మార్క్ పాలన చేస్తున్నాడు జగన్. గతంలో ఏ ప్రభుత్వం కూడా ముట్టుకోవడానికి భయపడే పనులను సైతం జగన్ వెను వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పార్టీ ఫిరాయింపులను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోనని చెప్పడం.. వెనుక బడిన వర్గాలకు 50 శాతం పదవులు కేటాయించడం.. గ్రామ సచివాలయాల ఏర్పాటు నిర్ణయం.. అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలు పెట్టడం.. ఇలా తొలి నెలరోజుల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన మార్క్ పాలన చేస్తున్నాడు. జగన్ నెల రోజుల పాలనపై అధిక మొత్తం ప్రజల్లో హర్షం వ్యక్తం చేస్తున్నా.. ప్రతి పక్షాలు మాత్రం తప్పులు పడుతూనే ఉన్నాయి.

చంద్రబాబు ని ఇబ్బంది పెట్టడానికి ప్రజావేదికను కూల్చారని టిడిపి నేతలు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అక్రమ కట్టడాలపై ఇప్పటికే ప్రజావేదికను కూల్చిన ప్రభుత్వం.. తాజాగా అక్రమ నిర్మాణాల విషయంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని పాలచర్ల గ్రామంలో ప్రముఖ దినపత్రిక ‘ఆంధ్రజ్యోతి’ యాజమాన్యం అనుమతులు లేకుండానే గాల్వాల్యం షీట్ భవనాన్ని నిర్మించారని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి కి గోదావరి డెవలప్ మెంట్ అథారిటీ నోటీసులు కూడా జారీ చేయడం విశేషం. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 1.75 ఎకరాల విస్తీర్ణంలో 2 అంతస్తుల ప్రింటింగ్ ప్రెస్ ను నిర్మించారని గోదావరి డెవలప్ మెంట్ అథారిటీ ఆరోపించింది. అంతేకాక.. నోటీసులు అందిన వెంటనే ఈ భవనాన్ని తొలగించాలనీ.. తొలగించని నేపథ్యంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. వారంలోగా స్పందించాలని ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ కుమార్తె వేమూరి అనూషకి నోటీసులు జారీచేసింది.