Wednesday, September 22, 2021

‘ఆర్ఆర్ఆర్’ అసంతృప్తిపై మెగా కాంపౌండ్ మీటింగ్

వరుస విజయాలతో దూసుకు వెళుతున్న దర్శకుడు రాజమౌళి.. పిన్న వయస్సులోనే అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అంటూ కలెక్షన్‌ల బాంఋలు కురిపించిన జూనియర్‌ ఎన్టీఆర్‌.. చిరంజీవి వారసుడిగా చిరుత వేగంతో దూసుకు వచ్చిన రామ్‌చరణ్‌. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ ముగ్గురూ తమదైన శైలి మార్కెట్‌తో దూసుకు పోతున్నారు. మరి ఇలాంటి ముగ్గురు తురుపు ముక్కలు కలిసి ఒక సినిమా చేస్తే.. అందులోనూ బాహుబలి వంటి అకాశమంత విజయం తర్వాత ఆదర్శకుడు చేపట్టిన ప్రాజెక్ట్‌ అయితే.. ఇక అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఇద్దరు హీరోలు టాలీవుడ్‌లో రెండు లెజెండరీ కుటుంబాలకు తాజా వారసులుగా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉంటే అంచనాలు ఊహకు కూడా అందవు. అలాంటి అత్యంత భారీ అంచనాలతో మొదలైంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.

300 కోట్ల రూపాయలతో రూపొందుతున్న ఈ చిత్రంలో చారిత్రక నేపథ్యం ఉన్న పాత్రలను పోషిస్తున్నారు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసమే ఇద్దరు హీరోలు అనేక వర్కవుట్‌లు సైతం చేసి బరిలోకి దిగారు. అయితే ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌కు సంబంధించిన పాత్ర చిత్రీకరణే ఎక్కువగా సాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి ఫోకస్‌ అంతా జూనియర్‌ మీదే పెట్టినట్లు వస్తున్న వార్తలు మెగాభిమానులను అసహనానికి గురి చేస్తున్నాయి. ఈ వార్తలు ఆనోటా.. ఈ నోటా రామ్‌చరణ్‌కు చేరాయి. దీంతో అభిమానులు ఎక్కడ ఎటువంటి రభసకు దారి తీస్తారోనని ఆలోచించిన మెగా కాంపౌండ్‌, మెగాభిమానుల నాయకులను పిలిపించి ‘‘ప్రస్తుతం చరణ్‌బాబు ‘సైరా’ సినిమాకు సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. అది మనకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌. పైగా మన స్వంత సినిమా. దాదాపు 300 కోట్లు రూపాయతో ముడిపడి ఉన్న ప్రాజెక్ట్‌. 4 లాంగ్వేజ్‌ల్లో తీస్తున్నాం.

నిర్మాతగా రామ్‌చరణ్‌మీద చాలా ప్రెషర్‌ ఉంది. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా మనకు ప్రతిష్ఠాత్మకమే. అయితే ‘సైరా’ పనుల వల్ల ఆ సినిమా డిస్ట్రబ్‌ కాకూడదని రాజమౌళిగారు, జూనియర్‌ ఎన్టీఆర్‌, చరణ్‌బాబు కూర్చుని ఓ నిర్ణయానికి వచ్చారు. ముందుగా చరణ్‌బాబుతో సంబంధంలేని సీన్‌లను, ఎన్టీఆర్‌ సోలో సీన్లను చేయాని, ‘సైరా’ బిజీ అయిపోగానే చరణ్‌ ఫుల్‌ప్లెడ్జ్‌గా బల్క్‌ కాల్‌షీట్స్‌ కేటాయించాలనేది వారి ఒప్పందం. అందుకే ముందుగా ఎన్టీఆర్‌కు సంబంధించిన సీన్లను తీస్తున్నారు. మీరు అనవసర అపోహలు పెట్టుకోవద్దు. ఇప్పుడిప్పుడే ఇంస్ట్రీలో మల్టీస్టారర్‌ సినిమా లు వస్తున్నాయి. ఇది అందరికీ చాలా మంచిది. కాబట్టి అనవసరంగా రభస చేయకండి. ముందు ‘సైరా’ సంగతి చూడండి. ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ఎంజాయ్‌ చేద్దాం. ఈ విషయం మన వాళ్లకు తెలియజేయండి’’ అంటూ అసలు విషయాన్ని వివరంగా చెప్పారట.

Latest Articles