ఇక ఆపు.. ధోని గురించి నీకు ఏమి తెలుసు?

0
18645

గత కొన్నాళ్ల నుండి ధోని బ్యాటింగ్ లో పదును తగ్గిన సంగతి తెలిసిందే. అయినా అప్పుడప్పుడు తన బ్యాట్ తో మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు ధోని. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో సైతం ధోని నిదానంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. ఆఫ్గానిస్తాన్‌ తో జరిగిన మ్యాచ్ లో 52 బంతులు ఆడి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. అలానే వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సైతం తొలి 20 పరుగులు చేయడానికి 40 బంతులు తీసుకోవడంతో.. ధోనీపై విమర్శలు చెలరేగాయి. ధోనీ నిదానంగా ఆడటంపై వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ లు విమర్శలు చేశారు.

అలానే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా ధోనీపై పెదవి విరిచాడు. ధోని బ్యాటింగ్‌ గొప్పగా లేదని.. సీనియర్‌ ప్లేయర్‌ అయి ఉండి చాలా బంతులు వృథా చేశాడంటూ సచిన్‌ టెండూల్కర్‌ సైతం విమర్శలు గుప్పించాడు. దీనితో ధోనీపై సీనియర్లు చేస్తున్న విమర్శలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనాన్ని వ్యక్తపరిచాడు. ఎప్పుడు, ఎక్కడ ఎలా ఆడాలో ధోనీకి బాగా తెలుసునని, ప్రతి ఒక్కరికి చెడురోజులు ఉంటాయని.. చెడు రోజును అవకాశంగా తీసుకొని అందరూ మాట్లాడడం సరికాదని.. ధోని ఒక లెజెండరీ క్రికెటర్ అని అన్నాడు. ధోనికి ఎప్పుడు ఎలా ఆడాలో బాగా తెలుసనీ.. పిచ్‌ను అంచనా వేయడంలో అతనికిసాటి లేరని కొనియాడాడు. ఒకానొక సందర్భంలో ధోనీ, కోహ్లీ ల విభేదాలు చెలరేగినా.. ఇప్పుడు మాత్రం ధోనికి కోహ్లీ మద్దతు నిలవడం విశేషం.