Wednesday, September 22, 2021

ఈమె ఆమె కాదెహె

రూపాయి పెట్టి టిక్కెట్‌కొన్న ప్రేక్షకుడు 2 రూపాయల వినోదం (సంతృప్తి) ఆశిస్తాడు. అలాంటి వారిని సంతృప్తి పరచడం ఓ పట్టాన జరిగే పనికాదు. ముఖ్యంగా ఈ సంతృప్తి బాధ్యతలు ఎక్కువగా హీరోయిన్‌పైనే ఉంటాయి. భారతీయ సినిమా విషయంలో ఒక్కో ప్రాంతానికి చెందిన ప్రేక్షకుల అభిరుచి ఒక్కో రకంగా ఉంటుంది. ఇంకా చెప్పాంటే మన పక్కనే ఉన్న తమిళనాడు ప్రేక్షకుల అభిరుచికి, మన ప్రేక్షకుల అభిరుచికి చాలా తేడా ఉంటుంది. హీరోయిన్‌ విషయంలో ఇది మరింతగా కొట్టొచ్చినట్లు కనపడుతుంది. భానుమతి, సావిత్రి, కృష్ణకుమారి, జయలలిత వంటి తారలు వెలిగిపోయిన ఆ తరం సినిమాల్లో హీరోయిన్‌ అందానికన్నా అభినయానికే ప్రేక్షకుడు వి లువిచ్చేవాడు. రాను రాను ప్రేక్షకుడు హీరోయిన్‌ అందాలకు ఓట్‌ వేయడం మొదలు పెట్టడంతో భారమంతా వారే మోయాల్సి వచ్చింది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితును అధిగమించడానికి తెలుగు తారలు నాజాగ్గా తయారవడం మొదలు పెట్టారు. మధ్య మధ్యలో అడపా దడపా కొందరు బొద్దు గుమ్మలు వచ్చినప్పటికీ.. అధికశాతం నాజూకు అందాలకే తెలుగు ప్రేక్షకుడు జైకొడుతూ వస్తున్నాడు. అదే తమిళనాడును తీసుకుంటే అక్కడ బొద్దు గుమ్మలకు ఉన్న క్రేజే వేరు. ఆ క్రేజ్‌కు మరింత క్రేజ్‌ను తీసుకువచ్చిన తారల్లో ముందు వరుసలో ఉంటుంది నమిత. తెలుగులో ‘జెమిని’, ‘సొంతం’ వంటి చిత్రాలలో ముద్దుగా కనిపించినప్పటికీ రాను రాను బొద్దుగా మారి తమిళ ప్రేక్షకుల ఆరాధ్యదైవంగా మారింది.

అలా తమిళప్రేక్షకులను సంతృప్తి పరుస్తూ అగ్ర కథానాయిగా వెలుగుగొందింది. ఈమె అందాలకు మెచ్చిన తమిళ తంబీలు ఏకంగా ఆమె కోసం గుడిని కూడా కట్టిపారేశారు. (గతంలో తంబీ లు నటి కుష్‌బూకు కూడా గుడిని కట్టారు.) ఇలా తంబీలను అలరించిన నమిత అకస్మాత్తుగా ఓ తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకుని పెద్ద స్క్రీన్‌కు దూరం అయిపోయింది. ఈ ఎడబాటును తట్టుకోలేక బాధపడుతున్న అభిమానులకు నమిత మరో షాక్‌ ఇచ్చింది. తాజాగా ఆమె జిమ్‌ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. సన్నగా నాజూగ్గా మారిపోయిన నమితను చూసిన ఆమె అభిమానులు ఒక్కసారి కళ్లు నుపుకుని మరీ చూడాల్సి వస్తోందట. ఇంకా నమ్మశక్యంగా లేని కొందరు అభిమానులు ఈమె ఆమె కాదెహె అంటూ వాదనలకు కూడా దిగేలా ఉన్నారట. చూశారా నమిత ఏం చేసినా సంచలనమే.

Latest Articles