Tuesday, May 18, 2021

ఏసీ గదులు ఎంతమందిని బలిగొన్నాయో!




గోదావరి నదిలో జరిగిన ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఇటు ఆంధ్ర, అటు తెంగాణ నుంచి పర్యాటకులు ‘వశిష్ఠ’ బోట్‌లో ప్రయాణించడం, అది సుడిగుండాల భారిన పడి మునిగిపోవడం, వీరిలో దాదాపు 40 మంది గల్లంతు అవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్రేకింగ్‌ న్యూస్‌ అయ్యింది. ఈ ప్రమాదంలో బోటు పైన ఉన్న వారు, డెక్‌పై ఉన్నవారి తమ చేతికందిన దాన్ని పట్టుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. వీరిలో కొందరికి లైఫ్‌ జాకెట్‌లు దొరకడంతో మృత్యువు నుంచి బయటపడ్డారు. మరికొందరు ఈత రావడం వలన సమీప గ్రామస్తు కాపాడే వరకూ నీటిలో నిలదొక్కుకున్నారు. మిగిలిన వారు గోదారమ్మ ఒడిలో చేరిపోయారు.

ఈ ప్రమాదం నుంచి బయట పడిన వారిలో అధికులు బోటు పైన ఉన్నవారే కావడం గమనార్హం. ఇదే బోటులో కింద ఫ్లోర్‌లో ఏసీ సౌకర్యం కూడా ఉంది. ఈ ఏసీ రూమ్‌లో కొందరు పర్యాటకులు ఉన్నారట. అయితే వారు ఎంతమంది అనేది లెక్కతేలకుండా ఉంది. బోటు ప్రమాదం భారిన పడినప్పుడు పైనున్న వారు వెంటనే తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఏసీ గదుల్లో ఉన్న వారికి తలుపు మూసి ఉండడం, బయట జరుగబోతున్న ఉపద్రవానికి సంబంధించిన కేక లు వినిపించే అవకాశం ఉండదు. బోటు ఒడిదుడుకుకు గురై మునిగిపోతున్న విషయం అర్ధమైన అకస్మాత్తుగా వారు తలుపులు తెరుచుకుని బయటపడే అవకాశాలు అస్సలు ఉండవు. కాబట్టి బోటు ప్రమాదాలు సంభవించినప్పుడు క్రింద ఉన్న వారు దాదాపు జల సమాధి కాకతప్పదు.

తాజా దుర్ఘటనలో బోటులోని ఏసీ గదులలో ఎంతమంది ఉన్నారు అనే విషయం ఇప్పటికీ లెక్కతేలేదు. సహజంగా టిక్కెట్లు బుక్‌ చేసుకున్నప్పుడే ఏసీ గదులు బుకింగ్‌ కూడా చేసుకోవచ్చు. బోటు బయలు దేరిన తర్వాత మధ్యలో కొందరు అప్పటికప్పుడు సిబ్బందికి డబ్బు చెల్లించి ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవడం కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ‘వశిష్ఠ’ విషయంలో ప్రయాణికుల పేర్లు తప్ప మరే వివరాలు సిబ్బంది నమోదు చేసుకోలేదు. టిక్కెట్‌ను విక్రయించేటప్పుడే ప్రయాణికుల పేరు, చిరునామా, ఫోన్ నెంబర్‌తో పాటు, సమీప బంధువు నెంబర్‌ కూడా తీసుకోవాలి.

కానీ ఈ నిబంధనలను అన్నింటిని సిబ్బంది తుంగలో తొక్కారు. ఇదే ఇప్పుడు మృతుల సంఖ్య, వివరాలు వంటి విషయాలకు ఆటంకాలుగా మారాయి. ఏది ఏమైనా ప్రాణాలతో చెగాటం వంటి నీటి మీద ప్రయాణం అప్పుడు లైఫ్‌ జాకెట్‌ను తప్పనిసరిగా ధరించడంతో పాటు వీలైనంత వరకూ ఓపెన్‌గా ఉండే స్థానంలో కూర్చోవడమే మేలు. ఇలా ఏసీ గదుల్లో ఉండడం వలన తప్పించుకోవడానికి ఉన్న దారులను మనకు మనమే మూసివేసుకున్నట్లు అవుతుంది.




Related Articles

Latest Articles