కారులో హెల్మెట్ పెట్టుకోలేదని రూ. 500 జరిమానా..!

0
427

కారులో హెల్మెట్ పెట్టుకోలేదని రూ. 500 జరిమానా ఇంటికి వచ్చిందా? అంటే అవుననే సంధానం ఇస్తున్నాడు పీయూష్‌ వర్ష్‌నే అనే వ్యక్తి. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ కి ఈ వ్యక్తికి హెల్మెట్‌ పెట్టుకోలేదన్న కారణంగా ఈ చలాన్ ధ్వారా రూ. 500 జరిమానా ఇంటికి రావడంతో ఖంగుతినడం తన వంతు అయింది. అయితే తాను కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఇలా చలాన్ రావడంతో.. అప్పటి నుంచి తాను వెళుతున్న కారులో కూడా హెల్మెట్‌ ధరించి మరీ ప్రయాణం చేస్తున్నాడు. రోడ్డు పై వెళుతున్న వాళ్ళు ఇతన్ని చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు.

ఈ విషయాన్ని మీడియా పసిగట్టి అతడిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పై అతడు మాట్లాడుతూ.. ‘పెరిగిన జరిమానాలతో ఎప్పుడు ఎక్కడ ఫైన్ వేస్తారో అని భయం భయంగా వెళుతున్నాము. హెల్మెట్‌ పెట్టుకోలేదన్న కారణంగా నా కారు నెంబర్ తో జరిమానా వచ్చింది. అప్పటి నుంచి జాగ్రత్తగా వెళుతున్నా. మళ్లీ చలాన్‌ వస్తుందేమోనని భయపడి.. కారులో వెళ్తున్నపుడు కూడా హెల్మెట్‌ పెట్టుకుంటున్నా’ అని చెప్పాడు సదరు వ్యక్తి. అయితే ఈ విషయం పై స్పందించిన ట్రాఫిక్‌ ఎస్పీ.. కారు నంబరు పేరుతో హెల్మెట్‌ పెట్టుకోలేదనే విషయం నిజం అయితే.. దానిని రద్దు చేస్తాం అని చెప్పారు. ఇకపై అలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకుంటామని తెలిపారు.