కేరళలోని మున్నార్ అడవుల్లో అద్భుతం

0
20457

దేవుడు ఉన్నాడా? అంటే.. ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు ఉన్నాడనే అనిపిస్తుంది. కేరళలో జరిగిన ఈ ఘటన జనాలను చలింప చేసింది. అర్దరాత్రి వేగంగా వెళుతున్న జీపు నుండి ఒక పసి కందు జారీ కుండా పడిపోయింది. జీపులో వెళుతున్న వారు ఎవరూ ఈ విషయాన్నీ గమనించలేదు. ఆ చిన్నారి కింద పడిపోయిన తరువాత పాకుతూ అటూ ఇటూ తిరిగింది. ఈ దృశ్యాలన్నీ దగ్గరలోని సిసి టీవిలో రికార్డు అయ్యాయి. మున్నార్ అడవుల్లో పడిపోయిన ఈ చిన్నారిని ఫారెస్ట్ అధికారులు రక్షించారు.

వెంటనే అన్ని చెక్ పోస్ట్ లను అలెర్ట్ చేసి వారి తల్లి తండ్రులను పిలిపించారు. చిన్నారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అదృష్ట వశాత్తు ఆ చిన్నారికి పెద్దగా ఏమి గాయాలు కాలేదని డాక్టర్లు చెప్పారు. చిన్నారి కింద పడిపోయిన సమయంలో అందరూ జీపులో నిద్ర పోతున్నట్లు తెలుస్తుంది. తల్లి ఒడి లోనుండి పాప జారీ పడిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ అడవిలో ఏనుగులు, సింహాలు, అడవి మృగాలు సంచరిస్తూ ఉంటాయి. అయితే వాటి కంట పడకుండా చిన్నారి సేఫ్ గా దొరకడం నిజంగా అద్భుతంగా భావించవచ్చు. దేవుడే తమ పాపని కాపాడాడని తల్లి తండ్రులు చెబుతున్నారు.