క్రికెటర్ మొహమ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్.. ఊరట

0
786

టీం ఇండియా క్రికెటర్ మొహమ్మద్ షమీ వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్నాళ్లుగా అతడు గృహ హింస కేసులో ఉన్నాడు. గత ఏడాది షమీ భార్య హసీన్ జహాన్ అతడిపై కేసు నమోదు చేసింది. దీనితో వెస్టిండీస్ టూర్ నుండి తిరిగి వచ్చిన 15 రోజుల లోపు లొంగిపోవాలని కోర్టు షమీని ఆదేశించింది. అయితే షమీ మాత్రం కోర్టుకు హాజరు కాకపోవడంతో.. అతడిపై అరెస్ట్ వారెంట్ జరీ అయింది.

ఇదిలా ఉండగా.. షమీ తరపు న్యాయవాది సలీమ్ రెహ్మాన్ కూడా కోర్ట్ ని ఆశ్రయించడంతో షమీకి కోర్టు స్వల్ప ఊరటను కలిగించింది. ఈ క్రికెటర్ ని అరెస్ట్ చేయకుండా రెండు నెలల పాటు స్టే విధించింది. తదుపరి విచారణ నవంబర్ 2న జరగనుందని క్రికెటర్ మొహమ్మద్ షమీ న్యాయవాది సలీమ్ రెహ్మాన్ వెల్లడించారు. కాగా.. టీం ఇండియా తరుపున క్రికెటర్ మొహమ్మద్ షమీ 70 వన్డేలు, 42 టెస్టులు, 7 టీ20లలో పాలు పంచుకున్నాడు. ఈ మధ్య జరిగిన ప్రపంచ కప్ లో కూడా షమీ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు.