చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభ్యం..

0
474

చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ ప్రయోగంలో ఇస్రో శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. విక్రమ్ ల్యాండర్ లొకేషన్ ని కనిపెట్టారు. అయితే లొకేషన్ ని కనిపెట్టినప్పటికీ ఇంకా సిగ్నల్స్ అందలేదు. అయితే రెండు మూడు రోజుల్లో కనిపెడతామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రయాన్ 2 ప్రయోగం తొంబై శాతం విజయం సాధించినట్లే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధాని మోడీ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. త్వరలోనే చంద్రయాన్ ప్రయోగాన్ని మళ్ళి చేపట్టాలనే ఆలోచనలో ఉంది ఇస్రో.

విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై సరిగ్గా ల్యాండ్ కానప్పటికీ.. ఆర్బిటర్ మాత్రం ఇంకా చక్కగా పయనిస్తుంది. ల్యాండర్ తో కమ్యూనికేషన్ ఏర్పడిన తరువాత ఈ ప్రయోగానికి సంబందించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. శనివారం అర్దరాత్రి నుండి ల్యాండర్ నుండి సంకేతాలు ఆగిపోయాయి. చంద్రునికి కేవలం రెండు కిలోమీటర్లు దూరం వరకు వెళ్లడం ఒక రకంగా లక్ష్యాన్ని చేదించించినట్లే అని ఇస్రో శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.