టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్న వాల్మీకి ట్రైలర్

0
638

గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో ఒక మంచి మాస్ సినిమా రాలేదు. అయితే తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడు ఆ కోరిక తీరనుందా? అంటే.. అవుననే అనిపిస్తుంది. వరుణ్‌ తేజ్‌ హీరోగా రానున్న చిత్రానికి హరీష్‌శంకర్‌ డైరెక్షన్ చేశారు. వరుణ్‌ తేజ్‌ డిఫరెంట్‌ లుక్ తో రానున్న ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. తమిళ్‌ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాని తెలుగులో వాల్మీకిగా హరీష్‌శంకర్‌ తీశారు. గతంలో హిందీలో దబాంగ్‌ సినిమాని తెలుగులో గబ్బర్‌సింగ్‌ గా తీసి సంచలన విజయం సాధించాడు హరీష్‌శంకర్‌. ఇప్పుడు కూడా రీమేక్ తో వస్తుండడంతో వాల్మీకిపై అలాంటి అంచనాలే నెలకొన్నాయి.

ఇప్పటికే వరుణ్‌ తేజ్‌ లుక్ పై ఆసక్తి నెలకొనగా.. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఒక మంచి మాస్ సినిమా కోసం మొఖమాచిన తెలుగు ప్రేక్షకులకు కరువు తీరేలా అనిపిస్తుంది. ఈ సినిమాలో గద్దలకొండ గణేష్‌ పాత్రలో వరుణ్‌ తేజ్‌ అచ్చుగుద్దినట్లు సరిపోయాడనే అనిపిస్తుంది. వాల్మీకి ట్రైలర్ లో వరుణ్‌ తేజ్‌ చెప్పిన డైలాగ్స్‌ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ‘మనం బతుకుతున్నామని పది మందికి తెలవకపోతే.. ఇక బతుకుడు ఎందుకురా?’ అనే డైలాగ్.. ‘నాపైన పందాలు వేస్తే గెలుస్తరు. నాతోటి పందాలు వేస్తే సస్తరు’ అనే డైలాగ్ లు ఇప్పుడు అలరిస్తున్నాయి. కాగా ఈ నెల 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.