టీమిండియా కోచ్ పదవిపై స్పందించిన గంగూలీ

0
1005

వరల్డ్ కప్ లో టీం ఇండియా మంచి ప్రదర్శన కనిపించినప్పటికీ.. సెమిఫైనల్ లో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమితో భారత జట్టు ప్రపంచ కప్ ని కోల్పోయింది. దీనితో టీమిండియా కోచ్ పదవి మార్చాలని బీసీసీఐ నోటిఫికేషన్ చేసింది. టీమిండియా కోచ్ పదవి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్ దిగ్గజాలు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీనితో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. ఏదో ఒకరోజు టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేస్తానని సౌరవ్ గంగూలీ చెప్పారు. ప్రస్తుతం తాను ఐపీఎల్.. ఇంకా బెంగాల్ క్రికెట్ సంఘం తో పాటు కామెంటరీ.. ఇంకా పలు కార్యక్రమాలలో బిజీగా ఉన్నానని చెప్పారు.

ప్రస్తుతం తనకు కోచ్ పదవికి పోటీపడే అవకాశం లేదని గంగూలీ వెల్లడించారు. అయితే.. రానున్న కాలంలో తప్పకుండా టీమిండియా కోచ్ పదవి కోసం తన ప్రయత్నం చేస్తానని చెప్పారు. కాగా.. కొన్నాళ్ళక్రితం బీసీసీఐ పెట్టిన నిబంధన ఇప్పుడు గంగూలీ కోచ్ పదవికి అడ్డం వస్తుంది. ఒకే వ్యక్తి రెండు, అంతకంటే ఎక్కువ పదవుల్లో కొనసాగకూడదని ఆంక్షలు విధించింది. ఏదో ఒక పదవిలో మాత్రమే కొనసాగాలని స్పష్టం చేయడంతో.. ఇప్పుడు ఆ నిబంధన టీమిండియా కోచ్ పదవి కోసం గంగూలీ అప్లై చేసుకుందుకు అడ్డువస్తుంది.