డబ్బు కోసం ఏమైనా చేస్తావా నాగార్జునా? మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా?

0
3622

సాధారణంగా సినీనటుడు అక్కినేని నాగార్జున వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే బిగ్ బాస్ రియాల్టీ షో హోస్ట్ గా బాధ్యత చేపట్టిన తరువాత నాగార్జున విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. నిన్నటికి నిన్న నాగార్జునపై తమ్మారెడ్డి భరధ్వాజ అసహనం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ షో ని, అక్కినేని నాగేశ్వరరావు కి లింక్ పెట్టి మాట్లాడడం సబబు కాదని తమ్మారెడ్డి భరధ్వాజ అన్నారు. నాగేశ్వరరావుగారి ఆలోచన బిగ్ బాస్ కాదని.. ఆయన ఇళ్లు బిగ్ బాస్ హౌస్ కాదని చెప్పారు. ఆత్మీయ కలయిక కోసం నాగేశ్వరరావు గారు అలా చేసేవారని అన్నారు. కానీ గెలవడం కోసం, డబ్బు కోసం చేసే షో ఈ బిగ్ బాస్ అని చెప్పారు. ఇక తాజాగా అక్కినేని నాగార్జున పై టీవీ యాంకర్ శ్వేతారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్ లో శ్వేతారెడ్డి మాట్లాడుతూ నాగార్జునపై పలు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నాగార్జునకు సామాజిక బాధ్యత లేదని శ్వేతారెడ్డి మండి పడింది. టాస్క్ ల పేరిట బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లను మానసికంగా వేధిస్తున్నారని శ్వేతారెడ్డి చెప్పింది. బిగ్ బాస్ షోపై ఇంత మంది అమ్మాయిలు ఆరోపణలు గుప్పిస్తున్నా నాగార్జున ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై వస్తున్నా ఆరోపణలు స్పందించకుండా.. ‘మన్మథుడు2’ సినిమా ప్రమోషన్ లు చేసుకుంటున్నాడని మండి పడింది. మీ ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు కదా అంటూ విమర్శలు గుప్పించింది. నాగార్జునకు దమ్ము ఉంటే తన భార్య, కోడలు సమంతాలను బిగ్ బాస్ షోకు పంపించాలని సవాల్ చేసింది. ‘డబ్బుల కోసం ఏమైనా చేస్తావా నాగార్జునా? అమల, సమంతలను బిగ్ బాస్ షోకు పంపి డబ్బులు సంపాదించుకో’వాలని చెప్పింది.