తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఏమి చేయాలి?

0
973

ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య తెల్ల జుట్టు. ముఖ్యంగా యువతని ఈ సమస్య పీడిస్తుంది. యుక్త వయసులోనే జుట్టు తెల్లగా వస్తుండడంతో యువతకి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 20 ఏళ్ళు నిండకుండానే తెల్లజుట్టు కనిపిస్తుండడంతో యువతలో నిరాశకు గురి అవుతున్నారు. అయితే ఈ సమస్యని ఉదృతం కాకుండా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో తెల్ల జుట్టు నల్లగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. జుట్టు తెల్లబడుతున్న సమయంలో బూరుగు పువ్వులు బాగా పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

బూరుగు పువ్వులు, కాలువ దుంపలు, గుంట గలగర ఆకు.. ఈ మూడింటిని సమంగా చేసుకోవాలి. వీటిలో కొద్దిగా నీరు కలిపి నూరాలి. ఆ తరువాత రెట్టింపు నువ్వులనూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తైలం మాత్రమే మిగిలేలా మరిగించాలి. ఆ తైలాన్ని మర్దనా చేసుకుంటూ ఉంటె.. జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. వీటితో పాటు ఉసిరి రసాన్ని కూడా అప్పుడప్పు సేకరిస్తూ ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా కొన్ని నెలలు చేసినట్లు అయితే.. క్రమంగా తెల జుట్టు రావడం తగ్గుతుంది.