Wednesday, September 22, 2021

దిశ కేసులో పోలీసులకు మరో కీలక సాక్ష్యం లభ్యం

సంచలనం సృష్టించిన దిశ కిరాతక ఉదంతంలో పోలీసులకు కీలకమైన సాక్ష్యం లభించింది. శంషాబాద్‌కు చెందిన వెటర్నరీ వైద్యురాలు దిశ(మార్చిన పేరు)ను నుగురు వ్యక్తు అతి కిరాతకంగా అత్యాచారం జరిపి ఆపై హత్య చేసిన విషయం విధితమే. ఈ కేసులోని నిందితులు దిశను దహనం చేసిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణించిన సంగతి కూడా తెలిసిందే. నిందితులు మరణించినప్పటికీ కేసు విచారణ మాత్రం యధావిధిగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. అంతే కాదు అమెరికాలో ఆ దేశ అధికారిక మీడియా నేషనల్‌ రేడియో న్యూస్‌లో నిందితుల ఎన్‌కౌంటర్‌ వార్తను ఉదయం బులిటెన్‌లో ప్రసారం చేశారు. ఇంతటి చర్చకు దారి తీసిన ఈ కేసుపై ఇటు తెలంగాణ హైకోర్టులోను, అటు జాతీయ మానవ హక్కుల కమిషన్‌లోను, మరోవైపు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.

ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు పకడ్బంధీగా విచారణ జరుపుతున్నారు. కేసు స్ట్రాంగ్‌గా ఉండేందుకు కావాల్సిన అన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులకు మరో కీలకమైన సాక్ష్యం లభించింది. గత నె 27వ తేదీన దిశను అత్యాచారం చేయబోయే ముందు నిందితులు ఆమె చేత మద్యం తాగించారు. దీనికి సంబంధించిన ఆనవాళ్లు పోస్ట్‌మార్టమ్‌ సందర్భంగా ఆమె లివర్‌లో బయటపడ్డాయి. ఈ మేరకు ఫోరెనిక్స్‌ నిపుణులు పోలీసులకు నివేదిక అందించారు. నిందితులు మద్యాన్ని ‘రన్‌వే 44’ వైన్‌ షాప్‌లో కొనుగోలు చేశారు. ఆ సీసీ టీవీ పుటేజ్‌ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఫోరెనిక్స్‌ నివేదిక పోలీసులకు మరింత గట్టి సాక్ష్యాన్ని అందించినట్లయింది.

ఇదిలా ఉంటే నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రజల నుంచి హర్షధ్వానాలు, సెబ్రిటీల నుంచి అభినందనలు అందుకున్న పోలీసు లకు, జాతీయ మావనహక్కుల కమిషన్‌, సుప్రీం కోర్టు విచారణతో వణుకు ప్రారంభం అయింది. ఎన్‌కౌంటర్‌ విషయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసు విచారణ నిమిత్తం నిందితుల మృత దేహాలను సైతం మరికొన్ని రోజులు గాంధీ ఆసుపత్రి మార్చురీలోనే భద్ర పరచాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది.

Latest Articles