నన్ను చూడడానికి ప్రభాస్ రావాల్సిందే.. లేకుంటే సెల్‌ టవర్‌ పై నుండి దూకేస్తా

0
1291

సినీనటులు అంటే సాధారణంగా ఎవరికైనా క్రేజ్ గానే ఉంటుంది. తమ అభిమాన నటుడి సినిమా వస్తుంది అంటే చాలు.. అభిమానులు పెద్ద హంగామా చేస్తారు. అయితే అది ఒక లిమిట్ లో ఉండాలి కానీ.. శృతి మించకూడదు. అలా శృతి మించిన అభిమాని ఇప్పుడు ఏకంగా సెల్‌ టవర్‌ ఎక్కాడు. గత కొన్నాళ్లుగా హీరో ప్రభాస్ అంటే దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఒక్క తెలుగు లోనే కాక.. హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రభాస్ కి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. దీనికి కారణం బాహుబలి సినిమా అని చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా ఇప్పుడు ప్రభాస్ పై అభిమానం వెర్రి ముదిరింది ఓ అభిమానికి.

జనగామ లో వెంకన్న అనే ప్రభాస్ అభిమాని అత్యంత ప్రమాదకరంగా సెల్‌ టవర్‌ అంచు మీద నిలబడి.. హీరో ప్రభాస్‌ అక్కడికి వస్తేనే టవర్‌ దిగుతానని బెదిరిస్తున్నాడు. ప్రభాస్ రాకపోతే సెల్‌ టవర్‌ పై నుండి దూకి చస్తానని బెదిరిస్తున్నాడు. ఇతడిది మహబూబాబాద్‌. తనకు ప్రభాస్‌ అంటే ఇష్టమని.. ప్రభాస్‌ను చూడాలని ఉందని చెబుతున్నాడు. తనను చూసేందుకు ప్రభాస్ రాకపోతే అక్కడి నుండి దూకేస్తానని బెదిరిస్తున్నాడు. ఇదెక్కడి చోద్యమని చూస్తున్న అక్కడి జనాలు ఈ ఘటనని వీడియో కు తీస్తున్నారు. యువకుడిని బతిమాలి కిందికి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.