నన్ను మంత్రి పదవి నుండి జగన్ తప్పిస్తే జరిగేది అదే..!

0
11792

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఈ సారి వైసిపి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా 151 సీట్లు గెలుచుకొని.. ప్రతి పక్షానికి డిపాసిట్లు కూడా దక్కకుండా చేసింది జగన్ పార్టీ. దీనితో ఇన్నాళ్లు జగన్ కి తోడుగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి మంత్రి పదవి కూడా ఇచ్చాడు జగన్. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి గా కొడాలి నాని ని జగన్ నియమించాడు. దీనితో ప్రజల వద్ద మంచి పేరు తెచ్చుకోవాలని కొడాలి నాని తన వంతు ప్రయత్నం మొదలు పెట్టాడు. గుడివాడ ప్రజలకు గతంలో కంటే ఇప్పుడు మరింత చెరువులో ఉంటానని కొడాలి నాని చెబుతున్నారు. పనులన్నీ చూసుకుని ఎంత ఆలస్యం అయినా కూడా గుడివాడ వచ్చేస్తున్నానని .. రాత్రి గుడివాడ లోనే ఉండి ఉదయం 11 గంటల సమయానికి విజయవాడ వెళుతున్నానని కొడాలి నాని చెప్పారు.

కాగా తాజాగా గుడివాడ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఐదోసారి తాను గెలిస్తే.. మంత్రులు గెలవరన్న సుడిగుండం నుంచి తాను బయట పడ్డట్లేనని అని అన్నారు. ఆలా జరిగితే.. తమకు ఎదురు ఉండదని అన్నారు. కాగా మంత్రి పదవి రెండున్నర ఏళ్ళు మాత్రమే ఉంటుందని జగన్ గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో.. కొడాలి నాని దీనిపై స్పందించారు. ఒకవేళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనను మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేస్తే.. తనకు ఉన్న సెక్యూరిటీ, పోలీసులు వెళ్ళిపోతారని చాలా తేలికగా చెప్పారు. సెక్యూరిటీ, పోలీసులు చుట్టూ పెట్టుకుని ప్రజలకు దూరమవడం వల్లే మంత్రులు ఓడిపోతున్నారని చెప్పారు. కానీ.. తాను మాత్రం మంత్రి పదవి ఉన్నా.. లేకున్నా గుడివాడ ప్రజలకు మరింతగా దగ్గరై సేవలు అందిస్తానని చెప్పారు. వైసీపీ నేతలంతా అధికారంలో ఉన్నామని విర్రవీగరాదని హెచ్చరికలు చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రజా సమస్యలను పరిష్కరించాలని మంత్రి కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు.