నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరదనీరు.. 22 గేట్లను ఎత్తి నీటి విడుదల

0
285

ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్ లకు వరద నీరు పోటెత్తుతోంది. నాగార్జున సాగర్ జల కలను సంతరించుకుంది. దీంతో 22 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే పోజెక్టు నిండి పోవడంతో గేట్ల పై నుండి సైతం వరద నీరు పొంగి వస్తుంది. ముందుగా 16 గేట్లను ఎత్తిన అధికారులు.. ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో ఆ తరువాత 22 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుండి దాదాపు నాలుగు లక్షల కుసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో డాం నుండి నీటిని దిగువకు వదిలారు.

సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589 అడుగులుగా ఉంది. 2009 లో రికార్డు స్థాయిలో వచ్చిన నీరు.. మరో సారి పునరావృతం అవుతుంది. దాదాపు ఒక్కక్క గేటు 10 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్ట్ లో కూడా పూర్తి స్థాయిలో నిండు కుండగా ఉంది. అక్కడ కూడా దాదాపు 8 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు.