నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావు

0
2058

చాలా రోజులకు తరువాత టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాధ్ కి ఒక హిట్ దొరికింది. హీరో రామ్, డైరెక్టర్ పూరీ జగన్నాధ్ లు కలసి తీసిన ఈ సినిమా మంచి విజయం అందించడంతో టీం అంతా సంబరాలలో మునిగింది. తాను హిట్ కోసం ఎప్పుడూ తపించలేదని.. కానీ హిట్ కొట్టి మూడేళ్లు కావడంతో, తొలిసారి హిట్ కొట్టాలని తపించానని.. మొత్తానికి “ఇస్మార్ట్‌ శంకర్‌” విజయంతో ఆ తపన తీరిందని చెప్పారు పూరీ జగన్నాధ్. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు నుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఈ సినిమా విషయంలో చాలా ఆందోళన పడ్డానని.. అయితే హిట్ సాధించడంతో ఆ ఆందోళన మొత్తం పోయిందని చెప్పారు. అందరూ ఇస్మార్ట్‌ శంకర్‌ 2 ఎప్పుడని అడుగుతున్నారని.. త్వరలోనే ‘ఇస్మార్ట్‌–2’ తీయాలని ఉందని చెప్పారు.

కాగా.. తాజాగా సినిమా ప్రదర్శిస్తున్న సినిమా థియేటర్ల వద్ద అభిమానులతో కలిసి తన టీమ్ తో పూరీ జగన్నాథ్ సంబరాలు చేసుకుంటున్నాడు. సహ నిర్మాత చార్మీ తో సహా.. చిత్ర యూనిట్ కూడా సినిమా థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సినిమా ప్రమోషన్ లో హన్మకొండకు వచ్చిన సమయంలో పూరీకి స్వీట్ షాక్ ఇచ్చాడు ఓ వీరాభిమాని. ఏకంగా పూరీ జగన్నాధ్ చిత్రాన్ని తన ఛాతీ మీద పచ్చబోట్టుగా పొడిపించుకున్నారు సదరు అభిమాని. ఆ అభిమాని పూరి వద్దకు వచ్చి ఆ చిత్రాన్ని చూపించగా.. ఈ సన్నివేశాన్ని నిర్మాత చార్మీ వీడియో తీసి.. తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేసింది. “ఓ డైహార్డ్ ఫ్యాన్ ప్రభాకర్ ఒంటిపై పూరీ జగన్ టాటూ. థ్యాంక్యూ సో సో మచ్. నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావు” అని క్యాప్షన్ పెట్టడంతో ఈ వీడియో వైరల్ అయింది. ఇదిలా ఉండగా.. కేజీఎఫ్‌ తో ఓవర్ నైట్ స్టార్‌ గా మారిన కన్నడ హీరో యష్‌ తో ఓ సినిమా తీసేందుకు డైరెక్టర్ పూరీ జగన్నాధ్ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తుండడం విశేషం.