పబ్ జీ గేమ్ కి అలవాటు పడి.. రీఛార్జికి డబ్బులు ఇవ్వలేదని తండ్రిని

0
737

కర్ణాటకలో దారుణం వెలుగులోకి వచ్చింది. పబ్ జీ గేమ్ కు అలవాటు పడి.. రీఛార్జికి డబ్బులు ఇవ్వలేదని తండ్రిని ముక్కలు ముక్కలు గా నరికి చంపాడు ఓ ఉన్మాది. ఆ వివరాలలోకి వెళితే.. కర్ణాటకలో బెళగావి వద్ద కాకతీ కాలనీలో శంకరప్ప కమ్మార (60) అనే వ్యక్తికి రఘువీర్‌ (21) అనే కొడుకు ఉన్నాడు. రఘువీర్‌ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కోర్సు చేసాడు. అయితే.. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న రఘువీర్‌ తన వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ లో పబ్ జీ ఆటకు బాగా అలవాటు పడ్డాడు. అది మితిమీరడంతో మిడ్ నైట్ లో విచిత్రంగా ప్రవర్తించే వాడు. రక్తం కావాలంటూ పక్కింటి వాళ్ళను అరుస్తూ అడిగేవాడు.

ఇతడి ఆగడాలు మితి మీరడంతో ఇరుగుపొరుగువాళ్ళు పోలీసులను కూడా ఆశ్రయించారు. దీనితో పోలీసులు శంకరప్ప కమ్మార, అతడి భార్యని, రఘువీర్‌ ని పొలిసు స్టేషన్ కి పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇది జరిగిన తరువాత మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి తండ్రిని డబ్బులడిగాడు రఘువీర్‌. అయితే పోలీసులు హెచ్చరించిన విషయాన్ని గుర్తుపెట్టుకున్న తండ్రి మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన రఘువీర్‌ కిచెన్ లోని కత్తి తీసుకువచ్చి తండ్రిపైకి దూకి గొంతు కోసేశాడు. అంతటితో ఆగకుండా తండ్రి చేతుల్ని, కాళ్లను బాడీ నుండి వేరు చేసి ముక్కలు ముక్కలు చేసాడు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే లోపే.. శంకరప్ప మరణించాడు. పోలీసులు రఘువీర్ ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకున్నారు.