పిల్లలు పుట్టకపోవడం కూడా ఒక కారణమే..!

0
1504

టివి నటుడు మధు ప్రకాష్ భార్య భారతి మరణం అనుమాస్పదంగా మారింది. తన భారీ ఏకాంత కాలంగా డిప్రెసిషన్ లో ఉందని.. అందుకే ఆత్మహత్య చేసుకుందని మధు ప్రకాష్ అంటున్నాడు. అయితే తన కూతురిని హత్యా చేశారని.. మధుప్రకాశే చంపేశారని భారతి తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు. లండన్ లో ఎంబీఏ చదివిన భారతి అక్కడే ఉద్యోగం చేసింది. 2015 లో పేస్ బుక్ లో మధు ప్రకాష్ తో పరిచయం కాగా.. అది ప్రేమగా మారగా.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. కొంతకాలం బాగానే ఉన్న వారి ఇద్దరి మధ్య కొన్నాళ్ళకు మనస్పర్థలు వచ్చాయి. దీనితో తరచు గొడవలు పడేవాళ్ళు. మంగళవారం మధ్యాన్నం మధుకి వీడియో కాల్ చేసిన భారతి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపింది. ఆయన వద్దని వారించాడు.

అయితే రాత్రికి ఇంటికి వెళ్లేసరికి ఫ్యాన్ కి ఉరి వేసుకొని ప్రాణాలు వదిలింది. దీనిపై మధు మాట్లాడుతూ.. తాము బయట బాగున్నా.. ఇంట్లో బాలేమని చెప్పాడు. తాను ఎవరితో మాట్లాడినా ఊరుకొనేది కాదని, ఫోన్ లు లాక్కొని స్విచ్ ఆఫ్ చేసేదని చెప్పాడు. తాను ఇండస్ట్రీ వాళ్ళతో క్లోజ్ గా ఉంటె ఇష్టపడేది కాదని.. ఇలా గొడవలు మొదలై ఇద్దరి మధ్య గాప్ వచ్చేదని తెలిపాడు. పెళ్లి జరిగిన నాలుగేళ్ళ కాలంలో కనీసం ఒక వంద సార్లు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేదని అన్నాడు. అయితే ఈ సారి నిజంగానే ఆత్మహత్య చేసుకుందని మధు ప్రకాష్ తెలిపాడు. తమకు పిల్లలు పుట్టకపోవడం కూడా ఒక కారణమని మధు చెప్పాడు. తనను గిచ్చడం, కొరకడం చేసేదని.. దాని వలన తాను బయటికి వెళ్లి పోయేవాడినని చెప్పాడు. అయితే ఇలా జరుగుంతుందని అనుకోలేదని వాపోయాడు నటుడు మధు ప్రకాష్.