Wednesday, September 22, 2021

పోలీసుల ఎదుట వేసుకుని… తర్వాత విప్పేశారు

చట్టాలు చేయడమే నాయకుల పని. వాటిని అము జరిగేలా చూడడం కిందిస్థాయి అధికారుల పని. ఈ అమలులో ఏమాత్రం ఇబ్బంది ఎదురైనా ముందుగా మనం ఆశ్రయించేది పోలీసులనే. అనేక రకాల డ్యూటీలు, వ్యాపకాలతో బిజీగా ఉండే వారు కూడా వీలైనంత వరకూ తమ విధులు సక్రమంగా నిర్వర్తించడానికి శాయశక్తులా కృషి చేస్తుంటారు. తాజాగా గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో కూడా పోలీసులు వారి విధులను సక్రమంగానే నిర్వర్తించారు. పోచమ్మగండి వద్ద పర్యాటకులను ఎక్కించుకుని బయలు దేరిన బోటును ప్రత్యేక పర్యవేక్షణ చేసే పోలీసులు అడ్డగించారట. నది ఉధృతి తీవ్రంగా ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి వెనక్కువెళ్లిపోండి అని హెచ్చరికుల కూడా జారీ చేశారట.

అయితే అప్పటికే దూర ప్రాంతాలనుంచి ముందుగానే షెడ్యూల్‌ వేసుకుని వచ్చిన పర్యాటకులు తమ ఆహ్లాదకరమైన ఆదివారాన్ని ఇలా పోలీసులు అడ్డుకోవడంతో అసహనానికి గురి అయ్యారు. పైగా అప్పటికే అధికారింగా టిక్కెట్‌లు కూడా కొనుక్కొని ఉండడంతో ఆ టిక్కెట్‌ను చూపించి ‘‘మీరు ఇప్పుడు బోట్‌ను ఆపడం కాదు.. ముందే టిక్కెట్‌లు అమ్మకుండా వారిని అడ్డుకోవాల్సింది’’ అంటూ పోలీసులుపై మూకుమ్మడిగా వ్యతిరేకత వ్యక్తం చేశారట. ఇక చేసేది లేక కనీసం లైఫ్‌ జాకెట్‌లు అయిన వేసుకుని తీరాల్సిందే అని పోలీసులు గట్టిగా చెప్పడంతో, పర్యాటకులు వారి ముందు లైఫ్‌ జాకెట్‌లు వేసుకున్నారు. మొత్తం అందరూ వాటిని ధరించడంతో పోలీసులు బోటును ముందుకు కదలనిచ్చారు.

అయితే కొద్ది దూరం వెళ్లగానే ఉక్కపోతగా ఉందని కొందరు. ఫొటోలు దిగడానికి ఇబ్బందిగా ఉందని కొందరు, భోజనాలు చేయడానికి కొందరు వాటిని విప్పి పక్కన పెట్టేశారట. అలా మృత్యువుకు తామే ఆహ్వానం పకడం ద్వారా గంగమ్మ ఒడిలో కలిసిపోయారు. గతంలో గోదావరి, కృష్ణా నదుల్లో జరిగిన పడవ ప్రమాదాల గురించి తెలిసినప్పటికీ మనకేం కాదులే అన్న ధైర్యంతో ముందుకు వెళ్లడం వలన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన చూసి అయినా ప్రజలు ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

Latest Articles