ప్రపంచ కప్ లో వెస్టిండీస్‌ పై భారత్ ఘన విజయం

0
1690

ప్రపంచ కప్ లో భాగంగా గురువారం జరిగిన భారత్, వెస్టిండీస్‌ ల మధ్య జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్‌ పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ లీగ్ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ పై భారత్ 125 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించడం విశేషం. మందంగా ఉన్న పిచ్ పై పరుగులు సాధించడం కష్టమైనా కూడా.. ఈ పిచ్ పై భారత్ ఇంత భారీ తేడాతో గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 269 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కోహ్లి 72 , ధోని 56 , రాహుల్‌ 48 , పాండ్యా 46 , పరుగులు సాధించడంతో వెస్ట్ ఇండీస్ ముందు భారత్ 269 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

అయితే.. భారత బౌలర్ ల ధాటికి వెస్ట్ ఇండీస్ కేవలం 143 పరుగులకే చాప చుట్టేసింది. షమీ, బుమ్రా లు ఆదిలో నిప్పులు చెరిగే బంతులతో వెస్ట్ ఇండీస్ బ్యాట్సమెన్ కు ముచ్చెమటలు పట్టించారు. ఏ దశలో కూడా వెస్ట్ ఇండీస్ జట్టు గెలుపు దిశగా వెళ్తున్నట్లు కనిపించలేదు. ఓపెనర్ సునీల్ ఆంబ్రిస్ సాధించిన 31 పరుగులే వెస్ట్ ఇండీస్ లో అత్యధిక స్కోర్ కావడం విశేషం. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు, బుమ్రా, చహాల్ చేరు రెండు వికెట్లు తీసుకోవడంతో.. 143 పరుగులకే చాప చుట్టేసింది. వరుసగా ఐదో విజయాన్ని సొంతం చేసుకున్న భారత జట్టు సెమీస్ ముంగిట నిలిచింది. కేవలం మరొక పాయింట్ సాధిస్తే, భారత జట్టు సెమీస్ లో స్థానం సంపాదిస్తుంది. కాగా.. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో ప్రపంచకప్‌ సెమీస్‌ రేస్‌ నుంచి విండీస్‌ నిష్క్రమించింది.