బిగ్ బాస్ లో హీట్ పుట్టిస్తున్న ట్రాన్స్ జండర్ తమన్నా..!

0
1689

బిగ్ బాస్ షో గత కొన్ని రోజులుగా చప్పగా సాగుతున్నా.. తాజాగా ట్రాన్స్ జండర్ తమన్నా బిగ్ బాస్ హౌస్ లో హీట్ పుట్టిస్తుంది. తన ఘాటైన వ్యాఖ్యలతో షో పై ఆసక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా తన ప్రత్యర్థి ఎవరో తెలిసిపోయిందని చెప్పింది. గురువారం జరిగిన డైమండ్ టాస్క్ లో గెలిచిన అలీ రెజా.. మగవాళ్ళు అందరూ ఆడవాళ్ళగా ఆదేశించడంతో.. ఈ టాస్క్ తాము చేయమని వరుణ్ సందేశ్, వితికా షేరు, జాఫర్, తమన్నాలు చెప్పారు. దీనితో వీళ్ళు అందులో పాల్గొనలేదు. అయితే.. కొద్దీ సేపు ఆ టాస్క్ పై అసహనం వ్యక్తం చేసిన తమన్నా.. ఆ తరువాత ఘాటు వ్యాఖ్యలతో అలీ రెజాను అవమాన పరిచింది. బాడీ ఉన్నంత మాత్రాన సూపర్‌ స్టార్‌ కాలేరని.. ఎట్టి పరిస్థితుల్లో అలీ రెజాను గెలవబోనివ్వనని బహిరంగంగా చెప్పింది.

దీనితో అలీ రెజా కూడా ఒకింత షాక్ కి గురి అయ్యాడు. ఇలాంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ తన ఆట తాను ఆడుకుంటున్నాడు. అయితే.. ట్రాన్స్ జండర్ తమన్నా మాత్రం వెనక్కి తగ్గలేదు. మరో సారి ఆషూరెడ్డి పై విరుచుకుపడింది. ఆషూరెడ్డికి అందం ఉన్నా.. సిగ్గు శరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలీ రెజా పక్కన ఎంతో అందంగా కూర్చుందని.. ఇద్దరికీ ఏమి సంబంధము ఉందని ప్రశ్నించింది. దీనితో సభ్యలందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అందరూ ట్రాన్స్ జండర్ తమన్నా తీరును తప్పుబట్టారు. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో ఒక్కసారిగా హీట్ పుట్టడం ఆడియన్డ్స్ మాత్రం ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు.