Wednesday, September 22, 2021

బెంగుళూరు లోని మునేశ్వర స్వామి ఆలయంలో అద్బుతం

ఒకరోజు రామనగర్ జిల్లాలో లో ప్రశాంత్ అనే యువకుడికి ఫోన్ వచ్చింది.ఫోన్ మాట్లాడిన వెంటనే ప్రశాంత్ కనకపుర రోడ్ వైపు పయనం సాగించాడు. కనకపుర తాలుకా తోటహళ్లి లో ఈ ఇల్లు ఇందులో మనకు అన్నో విచిత్రాలు అలాగే సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో కనిపిస్తాయి.ఇది మంత్రశాక్తా? లేక వేరే ఏదైనాన అన్నది మాత్రం ఎవరు ఉహించలేకున్నారు.ఇంట్లో వాళ్ళు బయాందోలనకు గురి అవుతున్నారు.ఆఇంట్లో రెండవ కుమారుడు రాజు . రాజు మరియు శశికలకు వివాహం చేసారు.ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది.పేరు సారిక అని నామకరణం చేసారు. అల 11 నెలలు గడిచాయి.

ఒక రోజు నిద్రపోతున్న సారిక గట్టిగ ఏడ్చింది.ఊపిరి ఆడక ఇబ్బందిపడుతున్న సారికను బెంగుళూరు హాస్పిటల్ కు తీసుకోని వెళ్లి తగ్గిన తరువాత మళ్లీ ఇంటికి తీసుకు వచ్చారు.ఇంటికి వచ్చిపడుకున్న సారిక గట్టిగ ఏడ్చిచనిపోయింది. అక్కడ విచిత్రం ఏమిటంటే సారిక మెడకు ఎవరు ఉరి వేసిన గుర్తు ఉండడంతో అందరు ఆశ్చర్యపోయారు.కొన్ని రోజులకు మళ్లీ శశికల ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. శ్రావణ్ అని పేరు పెట్టారు.పది నెలల తరువాత శ్రావణ్ కూడా సారికలానే ఏడ్చి ఊపిరి ఆడక ఇబ్బందిపడుతున్న శ్రావణ్ హాస్పిటల్ కు తీసుకోని వెళ్లి తగ్గిన తరువాత మళ్లీ ఇంటికి తీసుకు వచ్చారు.ఇంటికి వచ్చిపడుకున్న శ్రావణ్ గట్టిగ ఏడ్చిచనిపోయాడు.

తరువాత ఇతని మెడమీద ఉరి వేసిన గుర్తు ఉండడంతో అందరు ఆశ్చర్యపోయారు.మూడవసారి తల్లి ఐన శశికళ ఈసారైన తన బిడ్డను బ్రతికించుకోవాలని ఎన్నో పూజలు,హోమాలు,గ్రహశాంతులు చేయించారు.అయిన పలితం లేక పోయింది.నలుగో బిడ్డ ముత్తురాజు ఇతన్ని బతికించుకోవాలని సుమారు పది లక్షలు ఖర్చుపెట్టి ఇంటికి దిగ్భంధనం చేయించారు.ముత్తురాజు వయసు 2 నెలలు ఒక రోజు ఆదివారం రాత్రి సుమారు 9.30 టైములో ముత్తురాజు నిద్రలో ఏడ్చి పరుగెత్తుకుంటూ వచ్చిన బిడ్డను చూసిన కుటుంబ సభ్యులు భయంతో వణికి పోయారు. కారణం మెడకు ఎవరు ఉరి వేసిన గుర్తు ఇది చూసి అందరికి గుర్తు విషయం తెలియగానే మొదటి మాట ఇంక ఆ బిడ్డ బ్రతకడు. ఇది ఏమి వింత అని ప్రశాంత్ కు తెలియగానే అతను వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళను కలిసి,ఏవిధంగానైన సహాయం చెయ్యమని టీవీ 9ను ఆశ్రయించారు.

టీవీ 9 హాస్పిటల్ లో అన్ని పరిక్షలు చేయించి హిమోగ్లోబిన్ కొంచం తక్కువ ఉంది తప్ప, మరే ఇతర అనారోగ్యం లేదనడంతో తమ అడుగులను ఆద్యాత్మికం వైపు సాగించారు .బెంగుళూరు లోని జోడి మునేశ్వర ఆలయానికి చేరి అక్కడ ఆలయ ధర్మ కర్త అయిన శివశంకర స్వామికి విషయాన్నీ ఫోనులో వివరించగా ఆయన పిల్లవాడు పుట్టిన తేది,ప్రదేశం,తీసుకోని కేరళలోని కన్నురులో ఉండు ప్రధాన అర్చకులు కృష్ణ స్వామి అష్టమంగళ కుండలి వేసి సమస్యకు పరిష్కారం కనుక్కొని చేయు హామం గురించి చెప్పారు.పూజ పినియా లో ఉన్న జోడి మునేశ్వర ఆలయం లో సంకల్పం చేసి,అశోక శర్మ గారు మొదట నాగదేవత పూజ,మృత్యుంజయ హామం చేసి ఇంటికి పంపగా మరుసటి రోజు అందరు ఆశ్చర్య పడే విధంగా పిల్లవాడి మెడ మీద ఉన్న గుర్తు మాయమైంది.

Latest Articles