మంతెన సత్యనారాయణరాజుకి షాక్ ఇచ్చిన సీఆర్డీఏ

0
4236

అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ముఖ్యమంత్రి జగన్ దూసుకుపోతున్నాడు. అధికారంలోకి వచ్చిన నెల రోజులకే పాలనలో తనదైన ముద్ర వేసుకున్నాడు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ముట్టుకోవడానికి భయపడే పనులను సైతం జగన్ వెను వెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తదుపరి పాలన ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతున్నాడు జగన్. పార్టీ ఫిరాయింపులను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోనని చెప్పడం.. వెనుక బడిన వర్గాలకు 50 శాతం పదవులు కేటాయించడం సంచలనం రేపుతున్నాయి. ఇంకా గ్రామ సచివాలయాల ఏర్పాటు నిర్ణయం.. అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలు పెట్టడం.. ఇలా తొలి నెలరోజుల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన మార్క్ పాలన చేస్తున్నాడు. జగన్ నెల రోజుల పాలనపై అధిక మొత్తం ప్రజల్లో హర్షం వ్యక్తం చేస్తున్నా.. ప్రతి పక్షాలు మాత్రం ఎప్పటికప్పుడు జగన్ ని తప్పులు పడుతూనే ఉన్నాయి.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని ఇబ్బంది పెట్టడానికి ప్రజావేదికను కూల్చారని టిడిపి నేతలు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అక్రమ కట్టడాలపై ఇప్పటికే ప్రజావేదికను కూల్చిన ప్రభుత్వం.. తాజాగా అక్రమ నిర్మాణాల విషయంలో ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు కి కూడా నోటీసులు అందాయి. మంతెన ఆశ్రమానికి సీఆర్డీఏ అధికారులు రెండు రకాల నోటీసులు జారీ చేయడం విశేషం. కరకట్టపై ఆశ్రమాన్ని నిర్మించడం నిబంధనలకు విరుద్ధమని.. నోటీసుల్లో వెల్లడించారు. నిబంధనలను ఉల్లంగిస్తూ ఆరోగ్యాలయం నిర్మించారని.. అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని నోటీసుల్లో వెల్లడించింది. కాగా.. నిర్వాహకులు వివరణ ఇచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. నోటీసులు పంపించిన విషయం సీఆర్డీఏ అధికారులు గోప్యంగా ఉంచడం విశేషం.