మూడో పెళ్లికి సిద్దమైన నిత్య పెళ్లి కొడుకు

0
11197

ఇతగాడికి రెండు పెళ్లిళ్లు సరిపోలేదేమో.. మూడో పెళ్లి కి సిద్ధం అయ్యాడు. అయితే అతడి దురదృష్టం కొద్దీ ఇద్దరి భార్యలకు దొరికి అడ్డంగా బుక్కయ్యాడు. అంతే ఆ ఇద్దరు భార్యలు కలసి వీర కుమ్ముడు కుమ్మారు. ఈ ఘటనపై సంబందించిన వివరాలలోకి వెళితే.. తమిళనాడులోని కోయంబత్తూరు జల్లాకి చెందిన అరంగ అరవింద్‌ దినేష్‌ అనే 26 ఏళ్ల యువకుడు ఒక ప్రయివేటు సంస్థలో జాబ్ చేస్తున్నాడు. ఇతగాడికి 2016 లో ప్రియదర్శిని అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. అయితే ఇతడి ఆగడాలు భరించలేక పెళ్లి అయిన 15 రోజులకే అతడి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. తన భార్య వెళ్లిపోయిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా.. మరో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. దీనితో కల్యాణ వేదిక వెబ్‌సైట్ల ద్వారా అమ్మయి కోసం వేట మొదలు పెట్టాడు.

చివరికి అనుప్రియ అనే ఒక అమ్మాయి దొరకడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. అయితే.. అనుప్రియకు గతంలోనే పెళ్లి అయి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఈ విషయం తెలిసే అతడు పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యని హింసించినట్లే రెండో భార్యని కూడా చిత్ర హింసలకు గురి చేయడంతో.. ఆమె కూడా పుట్టింటికి జంప్ అయింది. దీనితో ఈ నిత్య పెళ్లి కొడుకు మరో అమ్మయి కోసం వేట మొదలు పెట్టాడు. మూడో పెళ్ళికి కూడా సిద్ధం అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి ఇద్దరు భార్యలు అతడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. బయటకు వచ్చిన దినేష్‌ ని చుట్టుముట్టిన భార్యలు అతగాడిని చితక కొట్టారు. అతడిపై కేసు పెట్టి పోలీసులకు అప్పగించారు ఆ ఇద్దరు భార్యలు.