Tuesday, May 18, 2021

వారసత్వమంటే అంత అలుసా?
రాజకీయంగా ఒక్కోమెట్టూ ఎక్కుతూ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు కేసీఆర్‌. మూగబోయిన తెలంగాణ వీణకు తీగలు సరిచేసి ఆరునొక్కరాగంలో 2001లో తెలంగాణ రాగాన్ని ఆలపించడం మొదలు పెట్టారు. అప్పటి వరకూ ప్రత్యేక తెలంగాణ కోసం వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటలకు తానే ఓ పెద్ద దిక్కుగా మారారు. పదవులు , రాజీనామాల తో ఉద్యమ వేడి చల్లారినప్పుడల్లా వేడిని రగిలించడం ద్వారా ఎట్టకేలకు కేంద్రం మెడ లు వంచి ప్రత్యేక తెలంగాణ సాధించారు. ఆ ఇమేజ్‌తోనే ఎన్నికలకు పోయి తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం అందించారు కేసీఆర్‌. ఇప్పటి వరకూ అంతా బాగానే ఉన్నా. రాను రాను ఆయనలో నియంతృత్వ పోకడలు పెరిగిపోయాయి.

ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన ఆయన మనస్సు శాశ్వత అధికారం వైపు చూడడం మొదలు పెట్టింది. ఈ కారణంగానే ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ ఉద్యమ కారులకన్నా రాజకీయ అవసరాలకు పనికివచ్చే వారినే ఆయన దగ్గరకు తీసుకోవడం మొదలు పెట్టారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించి వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అప్పుడే తెలంగాణ సమాజం అనుమానించింది. ఈ వసలవలన తెంగాణకు ఏమి లాభం అని. ఆనక ఉద్యమ సమయంలో తనకు దన్నుగా నిలిచిన వారిని నెమ్మదిగా వదిలించుకోవడం మొదలు పెట్టి సక్సెస్‌ అయ్యారు.

ఇలా తనకు తిరుగేలేదని భావన కల గడంతో ఒంటెద్దు పోకడలకు పోవడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ప్రస్తుత ఉన్న సెక్రటేరియట్‌ను వాస్తు దోషం నెపంతో కూలదోసి, ఎర్రమంజిల్‌లోని చారిత్రక వారసత్వ సంపదగా ఉన్న భవనాన్ని నేలమట్టం చేసి అక్కడ కట్టాలని నిర్ణయించారు. ఈ విషయమై ఎంతమంది చెప్పినా వినలేదు. ఎన్ని ప్రజా ఉద్యమాలు జరిగినా పట్టించుకోలేదు. ఏకపక్షంగా 2018 జూన్‌ 18న అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ కేసు విషయంలో న్యాయం స్థానం స్పందిస్తూ.. చారిత్రక వారసత్వ సంపద అంటే అంత అలుసు ఎందుకు.

నిక్షేపంగా ఉన్న ప్రస్తుత సెక్రటేరియట్‌ను కూదోయడం ప్రజల సొమ్ము దుర్వినియోగం తప్ప ఉపయోగం ఏమీ లేదు. పోనీ అసెంబ్లీని వేరే చోట కట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తే అది ప్రభుత్వ నిర్ణయంగా భావించి వదిలేయవచ్చు. కానీ ఎంతో చారిత్రక ప్రసిద్ధి చెందిన ఎర్రమంజిల్‌ భవనాన్ని కూ లదోయడాన్ని మాత్రం తీవ్రంగా పరిగణిస్తున్నాం. చట్టాలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు లేని సమయంలో కోర్టు తప్పకుండా జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది అంటూ మొట్టికాయలు వేసింది. మాట మాటకి తెలంగాణ సంపద, తెలంగాణ వారసత్వం అంటూ రాగాలు తీసే కేసీఆర్‌కు ఎర్రమంజిల్‌ కూడా తెలంగాణ ఘనమైన వారసత్వానికి ప్రతీకేనని ఇప్పటికైనా అర్ధం అయితే అదే సంతోషం.
Related Articles

Latest Articles