విజయనిర్మల గదిలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో.. స్వయంగా జగన్ కి చూపించిన నటుడు నరేష్

0
5785

ప్రముఖ సినీనటి, దర్శకురాలు విజయనిర్మల గురువారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను చివరి చూపు చూడడం కోసం పెద్ద ఎత్తున రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు రాగా.. ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అనంతరం విజయనిర్మల భౌతికకాయానికి జగన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. విజయనిర్మల గారికి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమట.

తన తల్లికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎంతో అభిమానమని.. విజయనిర్మల కొడుకు నటుడు నరేశ్ జగన్ కి తెలిపారు. అంతే కాదు.. విజయనిర్మల గారి ఇంట్లోని ఓ టేబుల్ పై పూలమాలలు వేసివున్న వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలను జగన్ కి చూపించడంతో.. జగన్ ఒకింత భావోద్వేగానికి గురై.. నరేశ్ ను కౌగలించుకున్నారు. కాగా.. వైఎస్ కుటుంబానికీ, కృష్ణ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో వైఎస్ తో మంచి సంబంధాలు ఉన్నాయి కూడా. ఏలూరు నుంచి ఆయన ఎంపీగా విజయం సాధించేందుకు వైఎస్ ముఖ్య కారణమని గతంలో కృష్ణ చెప్పారు కూడా. తదనంతరం కృష్ణ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. వైఎస్ కుటుంబానికి దగ్గరగానే ఉన్నారు.