విజయ నిర్మల భౌతికకాయం చూస్తూ కన్నీటి పర్యంతం అవుతున్న కృష్ణ

0
5620

ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల గురువారం ఉదయం మృతి చెందింది. దీనితో కృష్ణ కుటుంబం, సినీ వర్గాలు తీవ్ర విషాదంలో మునిగాయి. రాజకీయ ప్రముఖులు, సినీ పెద్దలు విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విజయనిర్మల మృతిపట్ల సంతాపం తెలిపారు. తాము చెన్నైలో ఉండే సమయంలో విజయనిర్మల ఇంటి ఎదురుగానే ఉండేవాళ్లమని.. అప్పటినుంచే విజయనిర్మల కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు.

ఇక విజయనిర్మల మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తన ప్రగాఢ సంతాపం వ్యక్త పరిచారు. కృష్ణ నివాసంలో విజయనిర్మల భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంలో కేసీఆర్ ను చూడగానే కృష్ణలోని దుఃఖం కట్టలు తెంచుకొని.. చిన్నపిల్లాడిలా విలపించారు. ఒక లెజెండ్రీ యాక్టర్ ని అలా కన్నీటితో చూడడంతో కేసీఆర్ కూడా చలించిపోయారు. కేసీఆర్ సైతం తీవ్ర భావోద్వేగాలకు లోను అయ్యారు. బోరున విలపిస్తున్న సూపర్ స్టార్ కృష్ణను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఈ ఘటనను చూసిన పలువురు.. కంట తడి పెట్టారు.