సాధారణంగా భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా కైనా సరే పబ్లిసిటీ కరెక్ట్ గా లేకపోతే సెట్ కాదు. అందుకే ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా కైనా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్ దగ్గర నుంచి మూవీకి సంబంధించిన అందరూ నటులు సందడి చేస్తూ ఉంటారు. అయితే తాజాగా విడుదలైన బన్నీ పుష్ప చిత్రం మాత్రం ఎందుకు మినహాయింపుగా కనిపిస్తోంది. మొదటినుంచి చిత్రానికి సంబంధించిన పబ్లిసిటీ బాధ్యతలు మొత్తం బన్నీ ఒంటి చేత్తో నడుపుకొస్తున్నాడు.
ఈ మూవీలో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేసిన నటులు ఎందరో ఉన్నారు.. అయినా సరే ఫంక్షన్స్ కి వాళ్ళు ఎవ్వరూ రాలేదు. ఆఖరికి డైరెక్టర్ సుకుమార్ కూడా చాలావరకు ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నారు. అయితే ఇది అతను మూవీ విడుదలకు సన్నాహాలు చేసే బిజీలో ఉండడంవల్ల జరిగింది అనుకోవచ్చు. మరి అయితే ఫహద్ ఫాసిల్ నుంచి సునీల్ వరకు ఎవ్వరు కూడా పెద్దగా ఈవెంట్లలో కనిపించలేదు. కనీసం మిగిలిన నటులు ఎవ్వరు కూడా ఓ చిన్న ఇంటర్వ్యూలో కూడా పాల్గొనలేదు. మూవీకి సంబంధించి ఎటువంటి ప్రస్తావన వాళ్ల నుంచి రాలేదు.
ఇక పుష్ప 2 మూవీ విడుదల దగ్గర పడుతున్న సమయంలో బన్నీ పూర్తిగా పుష్పరాజు లాగా మారిపోవడం మనం చూడవచ్చు. ఫంక్షన్స్ లో అతను స్టిఫ్ గా నడవడం.. కాస్త తెచ్చి పెట్టుకున్న ఆటిట్యూడ్ లాగా కనిపించింది. ఇక బన్నీ స్టేజి మీదకు వెళ్లడం.. అతను మాట్లాడే విధానం.. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నార్మల్ గా బన్నీ ఇలా ఉండడు.. అంటూ కొంతమంది పుష్ప ఈ వంటలకు సంబంధించిన కొన్ని ఫుటేజ్ లను వైరల్ కూడా చేశారు.
ఇక తాజాగా కేసు విషయంలో అరెస్ట్ అయినప్పుడు.. రిలీజ్ అయ్యాక అతని కలవడానికి సెలబ్రిటీలు అతని ఇంటికి వెళ్ళినప్పుడు.. అల్లు అర్జున్ తిరిగి చాలా నార్మల్ గా మునుపటిలా ఉన్నాడు. దీంతో పుష్ప2 విడుదలకు ముందు ఇప్పుడు అతని నడవడికలలో ఉన్న తేడాలను ఫోకస్ చేసి మరి మీమర్స్ సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు పెడుతున్నారు. దీంతో మొత్తానికి ఇటు బాక్సాఫీస్ వద్ద.. అటు సోషల్ మీడియాలో ప్రస్తుతం పుష్పరాజ్ వన్ మ్యాన్ షో అయిపోయింది.