బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర నట వారసుడిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్టార్ హీరో బాబీ డియోల్. హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన స్టార్ డం సృష్టించుకున్నాడు ఈ టాలెంటెడ్ యాక్టర్ .సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటూ బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అయితే, గడచిన కొంతకాలంలో బాబీ డియోల్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరో కాస్త అస్సలు చాన్సలు లేకుండా సినీ ఇండస్ట్రీకి దూరమైపోయాడు.
తన కెరీర్ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఒక దశలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, తన కొడుకు “అమ్మా, నాన్న ఏం పని చేయరు?” అని అడిగిన ప్రశ్నతో ఆయన గుండె ముక్కలైంది. కొడుకు పుట్టడానికి ముందు ఓ స్టార్ హీరో స్టేటస్ ని అతను అనుభవించినప్పటికీ.. కొడుకు పుట్టిన తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చవలసిన పరిస్థితి ఎదుర్కొన్నాడు. నిజానికి బాబి డియోల్ ఎంత పెద్ద హీరో అన్న విషయం అతని కొడుకుకి తెలిసేది కాదు.ఈ క్రమంలోనే, అతని జీవితాన్ని పూర్తిగా మార్చిన వ్యక్తి సందీప్ రెడ్డి వంగా.
తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన “యానిమల్” చిత్రంలో బాబీ డియోల్ పాత్ర ఆయన నటనను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా తర్వాత బాబీ డియోల్ మళ్లీ బాలీవుడ్లో బిజీ నటుడిగా మారిపోయారు. దర్శకులు, నిర్మాతలు ఆయనను సినిమాల కోసం వెతుక్కుంటూ వెళ్లే స్థితికి చేరుకున్నారు. “యానిమల్” చిత్రానికి ముందు సంతకం చేసిన పాత్రలు కూడా ఇప్పుడు మరింత ప్రాధాన్యం పొందాయి.
తాజాగా, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన “డాకు మహరాజ్” చిత్రంలో బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బాబీ డియోల్ జీవితంలో చోటుచేసుకున్న మార్పులను పంచుకున్నారు. “యానిమల్” సినిమా తర్వాత బాబీ డియోల్ తనకు వచ్చిన అవకాశాలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. “డాకు మహరాజ్” చిత్రంలో ఆయన పాత్రకు ఉన్న ప్రాధాన్యత కారణంగానే ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్నారని దర్శకుడు తెలిపారు.”సందీప్ రెడ్డి వంగా నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు,” అని బాబీ డియోల్ చెప్పిన ఈ మాటలు తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం. ఈ మార్పు కారణంగా ఇప్పుడు బాబీ డియోల్ బాలీవుడ్లో ఫుల్ బిజీ యాక్టర్ గా మారిపోయాడు.