సినిమాలలో ఎన్నో జోనర్లు ఉన్నప్పటికీ డిటెక్టివ్ కథలు అంటే ప్రేక్షకులు కాస్త ఇంట్రెస్ట్ కనబరుస్తారు. అధ్యంతం మంచి హైప్ తో సాగే ఈ చిత్రాలు.. కంటెంట్ కరెక్ట్ గా కనెక్ట్ అయితే ఇట్టే హిట్లయిపోతాయి. ప్రస్తుతం ఇదే జోనల్లో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది వికటకవి వెబ్ సిరీస్.
వికటకవి అంటే తెనాలి రామలింగడు.. అతను తన మేధాశక్తికి.. మాటలతో మనుషులను బోల్తా కొట్టించడానికి ప్రసిద్ధి చెందినవాడు. అటువంటి టైటిల్ పెట్టడంతో ఈ వెబ్ సిరీస్ లో కంటెంట్ కూడా అంతే సాలిడ్ గా ఉంటుందని అందరూ భావించారు. మరి వెబ్ సిరీస్ ను ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశారో తెలుసుకుందాం పదండి..
అమరగిరి సంస్థానంలోని దేవతల గుట్టకు అక్కడ దేవత శాపం పెట్టింది అనేది లోకల్ ప్రజల నమ్మకం. అక్కడికి వెళ్లిన వారికి ఏదో ఒకటి జరుగుతుంది అని వాళ్లు భావించడం.. అక్కడికి ఇప్పటికే వెళ్లిన 32 మంది వింత మనుషుల్లా తయారవడం.. ఇలా స్టోరీ కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇక అమరగిరి సంస్థానానికి రాజు దేవరాజుల రాజా నరసింహారావు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక సతమతమవుతుంటాడు.
మరోపక్క డిటెక్టివ్ రామకృష్ణకు తన తల్లి ఆపరేషన్ నిమిత్తం డబ్బు కావాల్సి వస్తుంది.. అదే టైంలో అతనికి అమరగిరి సమస్య గురించి తెలుస్తుంది. ఆ సమస్యను పరిష్కరించి రాజు నుంచి డబ్బు తీసుకొని తల్లి ఆపరేషన్ చేయించుకోవాలి అని అతను భావిస్తాడు. అయితే అమరగిరికి వెళ్లిన తర్వాత రామకృష్ణకు ఎదురైన సమస్యలు ఏమిటి? అసలు ఆ దేవత నిజంగా శాపం పెట్టిందా? దేవతల గుట్టమీద రహస్యం ఏమిటి? అనేది మిగతా స్టోరీ.
వికటకవి కథ ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుతుంది.. బ్యాక్ డ్రాప్, స్టోరీ లైన్ కరెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇక వెబ్ సిరీస్ స్టార్టింగ్ నుంచే మనకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక ఎపిసోడ్ చూద్దాం నచ్చకపోతే ఆపేద్దాం అనే టైప్ సీరియస్ అయితే కాదు ఇది. ఒక్కసారి స్టార్ట్ చేస్తే అది ఫినిష్ చేసేదాకా మనకు మనసు ఉండబట్టలేదు. కానీ మధ్య మధ్యలో స్టోరీ కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది కానీ ముందుకు వెళ్లే కొద్ది మన జస్ట్ అయిపోతాం. మీరు కూడా జీ 5 ప్లాట్ఫారం లో ఈ వెబ్ సిరీస్ ని ఎంజాయ్ చేయండి.