1000 కోట్ల క్లబ్.. రికార్డులు బద్దలు కొట్టిన చిత్రాలు ఇవే

0

ఒకప్పుడు సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేస్తే వాటి గురించి కొన్ని సంవత్సరాలు పాటు గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ చిత్రాలు భారీ టార్గెట్లను రీచ్ అవ్వడమే కాకుండా.. ఫస్ట్ డే కలెక్షన్స్ 100 కోట్లతో ప్రారంభిస్తున్నాయి. ఇక ఆ తర్వాత వేయి కోట్లు దాటడం ఓ వారానికి మించి టైం తీసుకోవడం లేదు. మరి ప్రస్తుతం ఇండియన్ మూవీస్ లో వేయి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాల లిస్టుపై ఓ లుక్కేద్దామా..

 

దంగల్:

అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా 70 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ 2050 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 2016 నుంచి ఇప్పటివరకు నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది.

 

బాహుబలి 2 :

 

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం పై విడుదలకు ముందు నుంచే హైప్ భారీగా ఉంది. దీంతో 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 1810 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

 

ఆర్ఆర్ఆర్:

 

ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి 550 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలయింది. ఇండియా బ్రిటిష్ పరిపాలనలో ఉన్న సమయంలో జరిగిన కథతో సాగే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 1300 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది.

 

కేజీఎఫ్ :

 

యష్ హీరోగా, ప్రశాంత్ నేను దర్శకత్వంలో కేవలం 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ కన్నడ చిత్రం ఏకంగా 1250 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి యష్ కు పాన్ ఇండియా స్టార్ గా భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది.

 

జవాన్

 

షారుక్ ఖాన్, దీపికా పదుకొనే కాంబోలో 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 1150 కోట్ల క్రాస్ ను కలెక్ట్ చేసింది.

 

కల్కి 2898 ad :

 

ప్రభాస్ హీరోగా భార్య అంచనాల మధ్య మహాభారతానికి.. కలియుగానికి మధ్య సాగే ఓ ఫిక్షన్ స్టోరీగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి చిత్రం 1100 కోట్ల గ్రోస్ ను వసూలు చేసింది.

 

పటాన్ :

 

షారుక్ , దీపిక పదుకొనే, జాన్ అబ్రహం కాంబోలో 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పటాన్ చిత్రం ఫుల్ రన్లో రూ.1050 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

 

పుష్ప 2 :

 

తాజాగా విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ అన్ని రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు వెళ్తోంది. ఇది విడుదలైన ఆరు రోజులకే 1000 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. రన్ టైం పూర్తయ్యలోపు మరికొన్ని రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితులు అంచనా.