అధిక శాతం జనాభా బరువు సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువ బరువు ఉండడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు.
శరీరం లో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ పని ఒత్తిడిలో పడిపోయి, సరిగా వర్కౌట్స్ చెయ్యడానికి ఓపిక లేక శరీరాన్ని పెంచుకుంటూ పోతుంటాము.
చాలా మంది ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదు. కొంతమంది త్రింది తినడం తగ్గించినా కూడా బరువు తగ్గకపోవడం వంటివి మనం గమనించొచ్చు.
అయితే ఒక జపనీస్ డైట్ ని ఫాలో అవ్వడం వల్ల అధిక బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ డైట్ ని ఫాలో అవ్వడం వల్ల ఇప్పటి వరకు చాలా పాజిటివ్ ఫలితాలు వచ్చినట్టుగా చెప్పుకొస్తున్నారు.
ఇంతకీ ఆ డైట్ ఏంటో, ఆ డైట్ కి తగ్గ ఎలాంటి వర్కౌట్స్ చెయ్యాలో అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.
చాలా మంది అరటిపండ్లు తింటే బరువు పెరిగిపోతారని అనుకుంటూ ఉంటారు. ఇది ముమ్మాటికీ చాలా తప్పు అట. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే అరటిపండ్లు తినడం వల్ల మన కడుపు నిండుగా ఉంటుంది.
రోజుకి కావాల్సినంత పోషకాలు అరటిపండ్లు వల్లే దక్కినట్టు అవుతుంది. బ్రేక్ ఫాస్ట్ బదులు అరటి పండ్లు తినడం వల్ల వెంటనే ఆకలి వెయ్యడు, వేరే జంక్ ఫుడ్ ని తినాలి అనే ఆలోచన మన బుర్ర కి రానివ్వదు.
అందువల్ల చాలా వరకు త్రింది ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం అట. అయితే అరటిపండ్లు ఒక్కో మనిషి శరీర తీరుకు తగ్గట్టుగా ఉంటుంది. కొంతమందికి బరువు తగ్గడానికి ఉపయోగపడితే, మరికొంతమందికి బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
కాబట్టి అరటిపండుతో పాటుగా సమ పరిణామం లో ఇతర పండ్లు కూడా కొన్ని తినాలి. అలాగే పాల పదార్దాలు, ఆల్కోహాల్ పదార్దాలు సేవించడం తగ్గించినప్పుడు కూడా శరీర బరువు తగ్గుతుంది. ఇక రాత్రి 8 గంటలు దాటిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం మంచిది.
ముఖ్యంగా స్వీట్లకు చాలా దూరంగా ఉండాలి. ఇలా స్ట్రిక్ట్ డైట్ తో పాటుగా భారీ వర్కౌట్స్ చేసే అలవాటు లేకపోయినప్పటికీ వాకింగ్ మరియు జాగింగ్ వంటివి చెయ్యడం శరీరానికి ఎంతో ఆరోగ్యం పెంచడమే కాకుండా,
శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇవి తూచా తప్పకుండా ఫాలో అయ్యేందుకు ప్రయత్నం చేసి చూడండి.