గతంలో పోలిస్తే టాలీవుడ్ సినిమాలకు ఆదరణ విపరీతంగా పెరిగింది. మన సినిమాలు టాలీవుడ్‌ను దాటి కోలివుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా కొన్ని చిత్రాలు ప్రపంచ స్థాయిలో కూడా బాక్సాఫీస్ హిట్లను సంపాదించిపెడుతున్నాయి. మన సినిమాలకు విదేశీయంగా కూడా భారీ అభిమానులు ఉన్నారు. గత పరిస్థితి చూస్తే హాలీవుడ్ సినిమాలు మన దగ్గర పాపులర్ అయితే.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.
మన సినిమాలు హాలీవుడ్ కు గట్టి పోటీ ఇస్తున్నాయని చెప్పచ్చు. సాంకేతిక పరంగా తక్కువ స్థాయిలో ఉన్నా.. కంటెంట్ పరంగా హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసుకోవడం లేదు. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలు విదేశాలలో బాక్సాఫీస్ హిట్లుగా నిలిచేవి.
అందుకే జపాన్ లాంటి దేశంలో రజనీకాంత్ కు కోట్లలో అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన ‘ముత్తు’ సినిమా రికార్డులను బాహుబలి కూడా బీట్ చేయలేకపోయింది. ఇప్పటికీ రికార్డుల పరంగా టాప్ లోనే ఉంది ‘ముత్తు’. కాగా ‘త్రిపుల్ ఆర్’ జపాన్ లో విడుదలై కేవలం 45 రోజుల్లో దాదాపుగా 450 యెన్ లు వసూలు చేసింది. ఇంకా కొన్ని రోజుల్లో ‘ముత్తు’ పేరుపై ఉన్న రికార్డును కూడా బద్దలు కొట్టడం ఖాయమని అక్కడి సినీ విశ్లేషకులు చెప్పడం విశేషం.
హాలీవుడ్ రేంజ్ లో ఫ్యాన్స్
ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్స్‌కు హాలీవుడ్ రేంజ్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సీక్వెల్ విదేశాల్లో బాక్సాఫీస్ హిట్లను సొంతం చేసుకుంది. ఈ మూవీకి సంబంధించి కీలకపాత్రల బొమ్మలతో అక్కడి మార్కెట్లు నిండిపోయాయంటే మూవీకి క్రేజ్ ఏ లెవెల్లో ఉందో ఇట్టే అర్థమవుతుంది.
ఇక రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘త్రిపుల్ ఆర్’ను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. రీసెంట్‌గా జపాన్ లో రిలీజై రికార్డులను తిరగరాస్తుంది ‘ట్రిపుల్ ఆర్’.
డిసెంబర్ 3న విడుదల..
ఇదే తరహాలో విదేశాల్లో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు చేసేందుకు మరో మూవీ రంగంలోకి దిగింది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప రష్యాలో విడుదల కాబోతుంది డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని రష్యన్ లాంగ్వేజ్ లో విడుదల చేయబోతుంది చిత్ర యూనిట్. ఇందు కోసం తారాగణం బుధవారం (నవంబర్ 30న) రష్యా రాజధాని మాస్కోకు వెళ్లింది.
హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలలో ఒకరు రవిశంకర్ అక్కడికి చేరుకున్నారు. డిసెంబర్ 1, 3వ తేదీల్లో పీటర్స్ బర్గ్ లో స్పెషల్ ప్రీమియర్ షో లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
రష్యా మీడియాతో సమావేశం..
చిత్ర బృందం రష్యాలోని, మాస్కోలో అక్కడి మీడియాతో బుధవారం స్పెషల్ మీట్ నిర్వహించింది. ఇందులో రష్యన్ మీడియా అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం చెబుతూ ఈ మూవీ కోసం చాలా శ్రమించానని చెప్పుకొచ్చాడు. రష్యన్ ప్రేక్షకులకు కూడా ఈ మూవీ నచ్చుతుందని చెప్పాడు.
ప్రపంచంలో నాకు నచ్చిన దేశాల్లో రష్యా కూడా ఒకటని, అప్పుడప్పుడూ ఇక్కడకు వస్తుంటానని చెప్పాడు. ఏది ఏమైనా ఈ మూవీ ఏ మేరకు రష్యన్లను అలరిస్తుందో వేచి చూడాలి మరి.