2024 ఎన్నికలకు ముందు మెగా మరియు అల్లు కుటుంబాల మధ్యలో రాజుకున్న చిచ్చు రోజురోజుకి పెరుగుతుంది. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తన స్నేహితుడు శిల్పా రవిని కలవడానికి అల్లు అర్జున్ వెళ్లడం మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరచింది. అప్పుడు మొదలైన మాటల యుద్ధం ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న పుష్ప 2 చిత్రంపై కూడా ఈ ఫ్యాన్ వార్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో మొదలైన మాటల యుద్ధం ఇరువైపులా అభిమానులు సీరియస్గా తీసుకోవడంతో తగ్గలేదు అన్నట్టు ముందుకు సాగుతోంది. ఇటు బన్నీ ఫాన్స్ కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు..”ఏం పీకలేరు బ్రదర్..”అంటూ పీకే అనే పదాన్ని పవన్ కళ్యాణ్ అనే అర్థం వచ్చేలా హైలైట్ చేసి మరి బ్యానర్స్ తో రెచ్చిపోతున్నారు. (పుష్పరాజ్)
ఫాన్స్ అంటే పర్లేదు.. మరోపక్క ఆ సదరు హీరో కూడా ఆ బ్యానర్ లో ఉన్న ఫోటోలను హైలైట్ చేయడం తో విషయం మరింత వివాదాస్పదంగా మారింది. మరి ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక కావాలని జరిగిందా అన్న విషయం ఎవరికీ తెలియదు.. కానీ మొత్తానికి బ్యానర్లు కనిపించేలా మాత్రం పుష్పరాజ్ ఫోటోలు షేర్ చేశాడు.
పవర్ స్టార్ కు వ్యతిరేకంగా ఉన్న బ్యానర్స్ కనిపించే విధంగా పుష్పరాజ్ ఇంస్టాలో ఓ స్టోరీని పోస్ట్ చేసిన వైనం సోషల్ మీడియా సంచలనంగా మారింది. అయితే జరిగిన తప్పును తెలుసుకున్న వెంటనే అలర్ట్ అవ్వడంతో ఆ ఫోటోని క్రాప్ చేసి, పవన్ కళ్యాణ్ అగైన్డ్ గా ఉన్న బ్యానర్స్ కనిపించకుండా ఎడిట్ చేసి తిరిగి రీ పోస్ట్ చేశారు. అయితే డామేజ్ రిపేర్ జరిగే లోపే జరగవలసిన పూర్తి నష్టం జరిగిపోయింది.
బన్నీ పెట్టిన స్టోరీని స్క్రీన్ షాట్స్ తీసి మరి మెగా ఫాన్స్ ఆన్లైన్ లో రచ్చ పుట్టిస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 మూవీ నుంచి విడుదలైన స్పెషల్ సాంగ్ కిస్సిక్ బాగాలేదు అన్న ట్రోలింగ్ విపరీతంగా జరుగుతోంది. ఈ టైంలో దీని ప్రభావం పుష్ప 2 మూవీపై మరింత దారుణంగా కనిపించే అవకాశం కూడా ఉంది.