సినీ ఇండస్ట్రీలో సక్సెస్ స్టోరీ లు ఎన్ని ఉంటాయో కాంట్రవర్సీలో అంతకుమించి ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త వివాదాలు సినీఫ్ ఇండస్ట్రీలో కొత్త ఏమీ కాదు. పైగా ఇప్పుడు సోషల్ మీడియా రంగ ప్రవేశం చేసిన తర్వాత సెలబ్రిటీ వార్ ని కాస్త ఫ్యాన్ వార్ గా మారుస్తున్నారు అభిమానులు. తాజాగా తమిళ్ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య కొనసాగుతున్న వివాదం అందరికీ తెలిసిందే.
నయనతార పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్’విడుదల తర్వాత ధనుష్ ఓ పెద్ద కాంట్రవర్సీని లేవనెత్తారు. సాధారణంగా డాక్యుమెంటరీ ఇలాంటివి తీసేటప్పుడు ఎవరైనా వేరే వ్యక్తికి సంబంధించిన వివరాలు, వారి పేరు ప్రస్తావించాలి అంటే ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్లు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిన తరువాతని వారికి సంబంధించిన వివరాలను అందరికీ వెల్లడించవచ్చు.
అయితే నయనతార డాక్యుమెంటరీలో అందరి దగ్గర ఎన్ఓసి తీసుకున్నారు తప్ప ఒక్క ధనుష్ దగ్గర మాత్రం తీసుకోలేకపోయారు. దీంతో తన పేరు ఉపయోగించడానికి తాను పర్మిషన్ ఇవ్వలేదని ధనుష్ చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. దీంతో నయనతార ఈ విషయంపై ఓ పెద్ద ఓపెన్ లెటర్ని రాశారు. ఇదిగో అదిగో అనుకుంటూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగి పెద్దదైంది.
అయితే అసలు జరిగిన విషయం ఏమిటి అన్నదానిపై ఎవరికి పూర్తి క్లారిటీ రాకముందే ఈ కాంట్రవర్సీలో ఓ హీరోయిన్ జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత పెద్దదయింది. కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి పార్వతి తిరువోతు. ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోయినా.. ప్రొఫెషనల్ గా మాత్రం ఆమె ఇచ్చే ఘాటైన స్టేట్మెంట్స్ ఎప్పుడు చిక్కుల్లో పడేస్తూనే ఉంటాయి.
అయినా ఎవరికి జంకకుండా మనసులో ఉన్నది ముక్కు సూటిగా చెప్పుకుంటూ పోవడం పార్వతికి అలవాటే. ఇదిగో ఇప్పుడు కూడా అదే చేసింది..నయనతార ఓ సెల్ఫ్ మేడ్ స్టార్ అని పొగిడిన పార్వతి.. తన ఓపన్ లెటర్ చదివినప్పుడు నేను తనకు సపోర్ట్ చేయడం ముఖ్యమని భావించాను అని చెప్పింది. ఇప్పటికే ఎటు పోతుందో తెలియని ఈ కాంట్రవర్సీ పార్వతి ఎంట్రన్స్ తో సరికొత్త మలుపు తిరిగింది.