టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. ఓ పక్క మెగా వెసెస్ అల్లు అభిమానుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కూడా ఈ చిత్రానికి విపరీతమైన హైప్ తెస్తోంది. ఇటు చిత్ర బృందం విడుదల తేదీ దగ్గర పడడంతో రోజుకో కొత్త అప్డేట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది.
సాధారణంగా తెలుగు సినిమాలు అంటే తమిళనాడు ఆదరణ చాలా తక్కువ అని చెప్పాలి. కొందరు హీరోల సినిమాలు తప్పనిచ్చి పెద్దగా మన సినిమాలు తమిళ్ లో ఆడవు. కానీ తమిళ్ డబ్బింగ్ చిత్రాలకు తెలుగులో విపరీతమైన ఆదరణ ఉంది. బాక్సాఫీస్ బద్దలు కొట్టే కలెక్షన్స్ తో మనం తమిళ సినిమాలను ఆదరించడమే ఇంతవరకు చూసాము.. అయితే ఈసారి పుష్పవిషయంలో తమిళనాడు లెక్కలు మారబోతున్నాయి.
ఇప్పటికే పుష్పరాజ్ మలయాళం మార్కెట్లో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు తన అడ్డాలోకి తమిళనాడు ని కూడా కలిపేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తాజాగా తమిళనాడులో నిర్వహించిన పుష్ప ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ అక్కడ వారిని బాగా ఆకట్టుకున్నాడు. అనర్గళంగా తమిళంలో మాట్లాడి ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. అంతేకాదు రజనీకాంత్ స్టైల్లో వాళ్ళని ఎంటర్టైన్ చేసి మరింత ఉత్తేజపరిచాడు.
ఇక పుష్ప కి తమిళనాడులో క్రేజ్ విపరీతంగా ఉండడంతో ఈసారి తమిళ్ వర్షన్ డిస్ట్రిబ్యూషన్ కు భారీ మొత్తమే దక్కింది. ఈ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంస్థ నిర్మాత అర్చన పుష్పా సినిమాపై తనకు భారీ అంచనాలు ఉన్నట్లు తెలియజేశారు. ఈసారి పుష్ప సినిమాకి తెలుగుతోపాటు తమిళ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదే జరిగితే సౌత్ మార్కెట్లో బాక్స్ ఆఫీస్ బాద్షాగా అల్లు అర్జున్ మారిపోతాడు అనడంలో సందేహం లేదు.