కే జి ఎఫ్ లాంటి భారీ సక్సెస్ అందుకున్న తర్వాత ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సలార్ మూవీ చేశారు. ఈ మూవీతో 1000 కోట్లు కొడతారు అని అంతా భావించినప్పటికీ లెక్కలు కాస్త మిస్ ఫైర్ అయ్యాయి. దీంతో సలార్ 2 చిత్రానికి కాస్త గ్యాప్ ఇచ్చాడు ప్రశాంత్. ఏ మూవీ తర్వాత అతను కాస్త స్లో అయినట్లు కనిపిస్తోంది. ఒకపక్క మూవీ తీయాలా లేదా అన్న డైలమా అయితే.. మరోపక్క ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో డేట్స్ దొరకడం లేదు. ఈ నేపథ్యంలో సైలెంట్ గా ఉండడం కంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కి మూవ్ అవ్వడానికి అతను ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో సరికొత్త ప్రాజెక్టును పూజా కార్యక్రమం తో గ్రాండ్ గా లాంచ్ చేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లని ఈ మూవీ గురించి ఓ తాజా అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర 2, వార్ 2 చిత్రాల షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక త్వరలో ఈ చిత్రాల నుంచి కాస్త గ్యాప్ తీసుకొని ప్రశాంత్ నీల్ మూవీపై ఎన్టీఆర్ ఫోకస్ పెట్టబోతున్నారు.
అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో రాబోయే చిత్రం టైటిల్ విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. దీనికి కారణం భఘీరా మూవీ డైరెక్టర్ ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ ఇదే అంటూ నోరు జారడం. దీంతో ఆ టైటిల్ నెట్ ఇంట్లో వైరల్ అవ్వడంతో పాటు మూవీ పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇలా అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించక ముందే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ టైటిల్ డ్రాగన్ అంటూ ప్రచారం జరిగిపోతోంది.
దేవరతో 500 కోట్లు మార్కులు దాటిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ మూవీతో 1000 కోట్లు కొల్లగొడతాడు అని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఏ మూవీ తర్వాత సలార్ 2 సెర్చ్ పైకి తీసుకువచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మరి డ్రాగన్ స్టోరీ ఏమై ఉంటుంది? ఇంతకీ ఇందులో ఎన్టీఆర్ ని నీల్ ఏ రేంజ్ మాస్ ఎలివేషన్ తో చూపించబోతున్నారు? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.