డిసెంబర్ ప్రారంభమైంది.. దీంతో అందరి దృష్టి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పైనే కేంద్రీకృతమై ఉంది. దీనికి ముఖ్య కారణం భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం. ఈ మూవీ ని థియేటర్లలో వీక్షించడానికి అల్లు అభిమానులు చాలా యాంగ్జైటీగా ఎదురుచూస్తున్నారు. దీనికి ముందు ఫ్రీక్వల్ గా వచ్చిన పుష్ప 1 అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సృష్టించింది.. ఇటు వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకొని అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పింది. మూడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పుష్ప 1 మూవీలో కన్నా పుష్ప 2 చిత్రంలో పుష్ప రాజుకు శత్రువులు భారీగా పెరిగారట. ఇక సిండికేట్, స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీ స్టోరీ లో హీరో కుటుంబంపై విలన్లు దాడి ఏ రేంజ్ లో ఉంటుందో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ ట్రైలర్లో ఓ శేవ దహనం సన్నివేశాన్ని కూడా అందరూ గమనించే ఉంటారు. అయితే ఇది శ్రీవల్లి శవం అన్న టాక్ నడుస్తోంది.
ఈ మూవీలో పుష్పరాజ్ తన భార్యను పోగొట్టుకుంటాడని.. తన ప్రాణమైన శ్రీవల్లిని చంపిన విలను చంపి పగ తీర్చుకుంటాడని ఈ మూవీకి హైలైట్ గా నిలిచిన జాతర సన్నివేశం కూడా ఈ సందర్భంలోనే వస్తుంది అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పుష్పరాజు భార్యను చంపిన విలన్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. పుష్ప 1లో పుష్పరాజ్ చేతులలో తన సిండికేట్ పోగొట్టుకోవడంతోపాటు బావమరిదిని కూడా పోగొట్టుకున్న మంగళం శీను శ్రీవల్లిని చంపుతాడు అని అందరూ భావిస్తున్నారు.
అయితే మరో పక్క కొంతమంది ఇది షికావత్.. లేక సిండికేట్‌ను తమ కంట్రోల్ లో తెచ్చుకోవాలనుకునే మరో బ్యాచ్ పనై ఉండే అవకాశం కూడా ఉంది కదా అని అంటున్నారు. ఏదేమైనా మొత్తానికి పుష్ప 2 లో ట్విస్టులకు, సస్పెన్స్ కు కొదవలేదని తెలుస్తోంది. అయితే అందరూ భావిస్తున్నట్లు చనిపోయింది శ్రీవల్ల.. లేక ఇంకెవరన్నా అనే విషయం చిత్రం విడుదలయితే తెలిసిపోతుంది.