టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కోట్లల్లో భారీ రెమ్యూనరేషన్లు పుచ్చుకుంటున్నారు. మరోపక్క మిడ్ రేంజ్, టైర్ 3 హీరోలు తక్కువ పారితోషకంతో సరిపుచ్చుకుంటున్నారు. అయితే సినిమాల స్కోప్ పెరుగుతున్న కొద్దీ.. టైర్ 3 హీరోలు కూడా తమ రెమ్యూనరేషన్ ని క్రమంగా పెంచుకుంటున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా సక్సెస్ సాధించిన కిరణ్ అబ్బవరం కూడా ప్రస్తుతం ఇదే పాలసీని అమలు చేస్తున్నారు.
తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన ‘క ‘మూవీ ఎటువంటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. ఇక ప్రమోషన్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కిరణ్ అబ్బవరం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం ఏ మూవీ తో అతని సక్సెస్ ఒక ట్రాక్లో పడింది…దీంతో తన రెమ్యూనరేషన్ పెంచుతాడు అన్న డౌట్లు కూడా భారీగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రూమర్స్ పై స్పందించిన కిరణ్ అభవరం ముక్కుసూటిగా తన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు..
అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ‘ క ‘మూవీ 50 కోట్ల క్లబ్లో జాయిన్ అయింది. ఈ నేపథ్యంలో కిరణ్ రాబోయే చిత్రాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో జోక్యం చేసుకోవడం తో పాటు రెమ్యూనరేషన్ ని కూడా భారీగా పెంచుతాడు అని ఇండస్ట్రీలో టోక్ నడుస్తోంది. ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో తన రెమ్యూనరేషన్ గురించి ప్రశ్న ఎదుర్కొన్న కిరణ్.. రెమ్యునరేషన్ పెంచిన మాట వాస్తవమే అంటూ కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. ఒక హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. తాను ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాన.. ఇప్పటికైనా పారితోషకం పెంచకపోతే ఎలా అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు..
కానీ రెమ్యునరేషన్ ఇష్టం వచ్చినట్లు పెంచే ఉద్దేశం లేదని చెప్పిన కిరణ్.. నిర్మాతలకు లాభాలు వచ్చిన తర్వాతే తన రెమ్యూనరేషన్ ఎక్కువగా తీసుకుంటానని.. నిర్మాతల గురించి కూడా ఆలోచిస్తానని పేర్కొన్నారు.ఇక ‘ క ‘ మూవీకి సీక్వెల్ తీసే ఉద్దేశం కూడా ఉందని కిరణ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని.. ఈలోపు తన లిస్టులో ఉన్న మిగిలిన ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడతానని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సీక్వెల్ గా రాబోయే మూవీ మొదటి చిత్రాని కంటే కూడా బ్రహ్మాండమైన స్టోరీ తో వస్తుంది అని పేర్కొన్నారు.