టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్న స్టార్ హీరోలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అలాంటి వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. పుష్ప 1 మూవీ తో అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ ఇండస్ట్రీకి తన రేంజ్ పెంచుకున్నారు. దీంతో రెండు రోజులలో విడుదల కాబోతున్న పుష్ప 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉండడంతో పాటు కలెక్షన్స్ కూడా అంతే భారీగా వసూల్ ఛాన్స్ ఉంది.
ఇక ఈ చిత్రం ఒక్కరోజు ముందే తెలుగు రాష్ట్రాలలో అంటే రేపే కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో ప్రీమియం షోలు పడబోతున్నాయి. అభిమానులు వేలకు వేలు ఖర్చుపెట్టి అందరికంటే ముందే సినిమా చూసాము అనే కిక్కు కోసం థియేటర్లకు ఎగబడుతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి భారీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఫాన్స్ కోసం చిత్ర బృందం నిర్వహించారు.
ఇక ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న జక్కన్న.. చిత్రంపై అంచనాలు మరింత పెంచే విధంగా మాట్లాడారు. “పుష్ప పార్ట్ 1 ప్రీ రిలీస్ సమయంలో కూడా ఇక్కడే నిలబడి నార్త్ ఇండియాను వదలద్దు అని బన్నీతో నేను చెప్పాను.. అక్కడ ఫాన్స్ నీకోసం చచ్చిపోతున్నారు.. మీ సినిమాని అక్కడ కూడా ప్రమోట్ చెయ్ అని ఆరోజు బన్నీకి సలహా ఇచ్చాను. నేను ఆ మాట చెప్పి మూడు సంవత్సరాలు పూర్తయింది.. అయితే ఇప్పుడు నేను బన్నీతో చెప్పాలనుకుంటే అది ఏమిటంటే.. అసలు ఇప్పుడు పుష్ప 2 కు సౌత్, నార్త్ . ఎక్కడ ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ ఎక్కడ ఉన్నా సరే ఈ సినిమా టికెట్లు కొనేస్తారు..”అని స్టేజిపై జక్కన్న ఓ రేంజ్ లో బన్నీని మోసేసాడు.
అంతేకాదు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎవరు వెళ్లిన సినిమా కు హెల్ప్ అయ్యే విధంగా మాట్లాడాలి అనుకుంటారు కానీ ఏ సినిమా గురించి అసలు ఏమి మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నాడు జక్కన్న. అంతేకాదు ఈ సందర్భంగా కొన్ని నెలల క్రితం అనుకోకుండా పనిమీద వెళ్ళినప్పుడు పుష్ప 2 షూటింగ్ సెట్స్ లో తనకు ఎదురైన అనుభవాన్ని కూడా పంచుకున్నారు.
“ఆ సెట్ కి వెళ్ళిన సమయంలో ఓ సీన్ చూస్తారా అని నన్ను అడిగారు.. అది పుష్ప ఇంట్రడక్షన్ సీన్.. ఆ సీన్ చూసి నేను షాక్ అయ్యాను.. ఒక్క సీన్ ఇలా ఉంది అంటే మొత్తం సినిమా ఎలా ఉంటుందో అని అనుకున్నాను..”అంటూ ఓ చిన్న క్లూ ని కూడా ప్రేక్షకులకు వదిలారు. మొత్తానికి జక్కన్న మాటలు వింటుంటే పుష్పరాజ్ అభిమానుల కోసం భారీగానే ప్లానింగ్ తో వస్తున్నాడు అని అర్థమవుతుంది.