కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలు ఎంతో భిన్నంగా ఉంటాయి.. అతని నటన అద్భుతంగా అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనడంలో డౌట్ లేదు. అయితే తాజాగా వచ్చిన కంగువా చిత్రం మాత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అంతకంటే భారీ అంచనాల మధ్య నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విడుదలైన మొదటి వారంలో డీసెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆ తర్వాత మాత్రం డిజాస్టర్ టాక్ ని మూట కట్టుకుంది. ఒక తమిళ్లో తప్ప మిగిలిన లాంగ్వేజ్ లో ఈ చిత్రానికి థియేటర్ ఆక్యుఫెన్సీ దారుణంగా పడిపోయింది. వసూలు పూర్తిగా డ్రాప్ అవడంతో చాలా దగ్గరలో సినిమాని ముందుగానే ఆపేశారు. ఇక తమిళనాడులో కూడా మూడోవారం చివరికి వచ్చేసరికి కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయిపోయాయి..
తమిళ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు లెవెల్ కలెక్షన్స్ వసూలు చేస్తుందని భావించిన కంగువా చిత్రం తమిళ్ సినీ చరిత్రలోనే నిలిచిపోయేటంత డిజాస్టర్ గా మిగిలింది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ విడుదలకు ముందు నిర్మాత జ్ఞానవేల్ రాజా కంగువాా సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోల్లింగ్ అవుతున్నాయి.
సినిమా కలెక్షన్ లెక్కల చూపించి మరీ ఆయన కామెంట్స్ ని విమర్శిస్తున్నారు నేటిజెన్లు. సుమారు 200 కోట్ల షేర్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం మొత్తం రన్ పూర్తయ్య సమయానికి కనీసం 70 కోట్ల షేర్ కూడా రాబట్ట లేకపోయింది. అంటే ఈ సినిమా నిర్మాతలకు, బయ్యర్లకు 130 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.. ఈ మధ్యకాలంలో ఇంత భారీ నష్టం చిన్న సినిమాలకు కూడా రాలేదు.. నిన్న మొన్నటి వరకు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ 120 కోట్ల నష్టంతో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. అయితే ఇప్పుడు ఆస్థానాన్ని సూర్య కంగువా దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించకపోయిన.. నష్టాల రికార్డులో మాత్రం ఈ మూవీ రికార్డు సృష్టించింది అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.