టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా పుష్ప గురించి ఏదో ఒక న్యూస్ వింటూ ఉన్నాము.. అయితే వీటిలో కొన్ని ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఉన్న వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా పుష్ప 2 మూవీ నీ మొదటి రోజు చూడడానికి వెళ్లి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రష్ భారీగా ఉండడంతో కొన్నిచోట్ల చిన్నపాటి సమస్యలు తలెత్తాయి. అయితే సినిమా చూడాలి అని చాలా ఉత్సాహంగా థియేటర్కు వెళ్లిన ఓ కుటుంబం మాత్రం తీరని బాధతో మిగిలిపోయింది. సంధ్య 70ఎంఎం థియేటర్ లో అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని చూడడానికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో జరిగిన తొక్కేసలాటలో రేవతి అనే మహిళ మరణించింది.
అంతేకాదు ఆమె 13 సంవత్సరాల కొడుకు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై స్పందించిన హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈరోజు సంఘటనకు సంబంధించి ఓ ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. అల్లు అర్జున్ సినిమా థియేటర్ కి సినిమా చూడడానికి వస్తున్నారు అని తెలిసినప్పటికీ థియేటర్ మేనేజ్మెంట్ వారి రాక గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రేక్షకులను నిర్వహించడానికి భద్రతకు సంబంధించిన ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు అల్లు అర్జున్, అతని వెంట వచ్చిన వారు వచ్చి వెళ్లడానికి వేరుగా ఎంట్రన్స్, ఎగ్జిట్ పాయింట్స్ లేవని ఆయన చెప్పారు. మృతుడు కుటుంబ సభ్యులు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ మేరకు సెక్షన్ 105, 118 (1) r/w 3(5) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు థియేటర్ లోపల ఓ వ్యక్తి మరణానికి, ఓ బిడ్డ గాయానికి కారణమైన అస్తవ్యస్త పరిస్థితులు.. వాటికి బాధ్యులైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు థియేటర్ యాజమాన్యం, సెక్యూరి మేనేజర్ తో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.