టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. లాస్ట్ సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య మూవీ తో చిరంజీవి ఒకప్పటి ముఠామేస్త్రిని గుర్తు చేస్తూ భారీ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభరాపై భారీ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు ఏ మూవీ తో పాటు చిరు తన సరికొత్త ప్రాజెక్టుని కూడా అనౌన్స్ చేశారు. నాని సమర్పణలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు తన సరికొత్త చిత్రాన్ని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత పేరు వైరల్ అవుతుంది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రానికి సుస్మితా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఇక ఆమె అందించిన కాస్ట్యూమ్స్ ఆ సినిమాలో సెట్ కాలేదు సరి కదా .. ఫ్యాన్సీని కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక తర్వాత సైరా, గాడ్ ఫాదర్, భోళాశంకర్, ఆచార్య.. ఇలా చిరంజీవి నటించిన ఏ సినిమాలో కూడా ఆయన కాస్ట్యూమ్స్ ఆయనకు సెట్ కాలేదు.
దీంతో ఓ రకంగా సుస్మిత కాస్ట్యూమ్స్ చేస్తోంది అంటే ఆ సినిమా డిజాస్టర్ అయిపోతుంది అన్న టాక్ మెగా అభిమానుల్లో బలంగా ఉంది. ఇప్పుడు చిరంజీవి సరికొత్త చిత్రాన్ని ప్రకటించడంతో.. ఫాన్స్ మళ్లీ సుష్మిత ఈ చిత్రానికి దూరంగా ఉంచండి అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించి అనిరుద్ని మ్యూజిక్ కి తీసుకోవాలని కోరుకుంటున్నారు. వింటేజ్ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పొరపాటున కూడా సుష్మితను తీసుకోకూడదని సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రంతోపాటు చిరంజీవి అనిల్ రావిపూడి తో మరొక చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అనిల్ రావిపూడి కామెడీ మూవీ కంటే కూడా శ్రీకాంత్ ఓదెల మూవీ పై మెగా అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇక ప్రస్తుతం మెగా ఫాన్స్ సుస్మిత విషయంలో చేస్తున్న రచ్చ చిరంజీవి వరకు చేరుతుందా.. ఆయన దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు అన్న విషయం చూడాల్సి ఉంది.