ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తనపై లైంగిక దాడి చేశారు అని.. మైనర్ గా ఉన్నప్పుడే ఈ ఘటన జరిగిందని అతని దగ్గర పని చేసిన ఓ లేడీ కంటెస్టెంట్ కేసు పెట్టడంతో జానీ మాస్టర్ జైలు పాలయ్యారు. అయితే కొన్ని రోజుల తర్వాత కష్టం మీద బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ తాజా అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న జానీ మాస్టర్ ఏకంగా రెండుసార్లు నేషనల్ అవార్డు అందుకోవాల్సిన వ్యక్తి. గతంలో ఒకసారి నేషనల్ అవార్డు అందుకున్న జానీ మాస్టర్ ఈ కేసులో ఇరుక్కున్న కారణంగా ఈసారి అవార్డు అందుకోలేక పోయారు. 2009లో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన జానీ మాస్టర్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించి స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజాగా ధనుష్ హీరోగా నటించిన తిరుచిత్రంలో ఓ పాట కొరియోగ్రఫీకి గాను ఆయన నేషనల్ అవార్డు అందుకున్నారు. అయితే అదే సమయానికి ఆయనపై లైంగిక దాడి కేసు నమోదు కావడంతో కమిటీ ఆ అవార్డును వెనక్కి తీసుకుంది. జానీ మాస్టర్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన సినీ కెరీర్ ఓరకంగా స్టాప్ అయిపోతుంది అని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న జానీ మాస్టర్ కి ఊరట కలిగిస్తూ ఆయన టాలెంట్ ని గుర్తించిన ఓ స్టార్ హీరో తిరిగి ఆయనకు కొత్తగా అవకాశం ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.
మహానటి కీర్తి సురేష్, బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కాంబోలో తెరకెక్కుతున్న హిందీ చిత్రం బేబీ జాన్.. తమిళ్ లో విజయ్ సూపర్ డూపర్ హిట్ సాధించిన తేరి చిత్రానికి ఇది రీమేక్. ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కోసం జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫీకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇంకా ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. జానీ మాస్టర్ పై ఆరోపణలు వచ్చినప్పటికీ కొందరు సినీ సెలబ్రిటీలు మాత్రం ఆయనకే అండగా నిలుస్తున్నారు. ఒక మనిషి ఎదిగే క్రమంలో అతనిపై బురద చల్లడానికి ఎందరో ప్రయత్నిస్తారని.. జానీ మాస్టర్ పై పెట్టిన కేసుని నమ్మడం కష్టంగా ఉందని ఎందరో సోషల్ మీడియా వేదికగా అప్పట్లో జానీ మాస్టర్ కి అండగా నిలిచారు. నిజంగా ఈ అవకాశం దక్కడం జానీ మాస్టర్ కు ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది అని భావిస్తున్నారు.