2024 దాదాపు పూర్తి కావస్తోంది.. కొత్త సంవత్సరంతో పాటు కొత్త సినిమాల సందడి కూడా ప్రారంభమవుతుంది. అయితే 2024లో విడుదలైన రెండు భారీ చిత్రాలు దేవర, పుష్ప 2. ఈ రెండు చిత్రాలకి కూడా సీక్వెల్స్ ఉంటాయి అన్న విషయం ముందుగానే ప్రకటించారు మేకర్స్. అలాగే సినిమాల చివర కూడా సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయి అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.
దేవుని విషయానికి వస్తే.. మూవీ రెడీ అవ్వడానికి ఎంత టైం పట్టిందో అందరికీ తెలుసు. అలాగే పుష్ప 2 సినిమా రెడీ అవ్వడానికి మూడు సంవత్సరాల పైనే పట్టింది. ఇక ఈ చిత్రాలు పూర్తయిన నేపథ్యంలో ఇటు జూనియర్ ఎన్టీఆర్, అటు అల్లు అర్జున్ తమ నెక్స్ట్ సినిమాలతో ఫుల్ బిజీగా మారబోతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో డబ్ల్యూ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న వార్ 2 మూవీ తో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇక దేవరకు, పుష్ప 2కు రివ్యూలు కాస్త అనుకున్న దాని కంటే డల్ గానే వచ్చాయి. మూడు సంవత్సరాలు సుకుమార్ మూవీ తో గడిపేసిన బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇద్దరు హీరోలు బిజీగా ఉండడంతో నెక్స్ట్ సీక్వెల్ చిత్రాలు వెంటనే వస్తాయి అనేదానికి ఎటువంటి గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ చిత్రాలకు సీక్వెల్ ఉంటుందా ఉండదా అన్న విషయంపై కూడా జోరుగా చర్చ జరుగుతుంది.
జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రం క్రిటిక్స్ ని పెద్దగా మెప్పించలేకపోయింది. కలెక్షన్స్ పరంగా సినిమా బాగున్నప్పటికీ ఈ స్టోరీ పరంగా చాలా వీక్ గా ఉంది అంటూ ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేవర 2 క్లిక్ అవ్వాలి అంటే కొరటాల శివ వెంటనే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేయాలి.. ఎన్టీఆర్ కూడా తన తదుపరిచిత్రం తర్వాత వెంటనే ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టాలి. అయితే అది 2025లో సాధ్యపడేలా కనిపించడం లేదు.
ఇక పుష్ప విషయానికి వస్తే మొదటి భాగానికి వచ్చినంత ఆదరణ తెలుగు ప్రేక్షకుల నుంచి రెండవ భాగానికి రాలేదని చెప్పాలి. రికార్డ్ లెవెల్ కలెక్షన్స్ లో దంచి కొడుతున్నప్పటికీ పుష్ప 2 సొంత ఇంట్లో ప్రేక్షకులను మెప్పించడంలో కాస్త తట పటాస్తోంది.. నార్త్ బెల్ట్ వసూళ్లు బాగున్న సౌత్ లో మాత్రం సైలెంట్ గానే ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప 3 ఎంతవరకు సాధ్యం అనే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ రెండు చిత్రాలకి సీక్వెల్స్ ఉంటే 2026 లేక 2027 లోనే సాధ్యపడతాయి. అప్పటివరకు వెయిట్ చేసి చూడాల్సిందే..