ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలైనా సరే 100 కోట్ల మార్పు దాటాలి అంటే చాలా కష్టంగా ఉంది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ లాంటి చిత్రాలకు కూడా ఈ మార్క్ దాటడం కాస్త కష్టమే అయింది. అలాంటి ఏరియాలో ఓ తెలుగు డబ్బింగ్ చిత్రం రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పుడు స్మార్త్ లో ఎక్కడ చూసినా పుష్పరాజ్ రూల్ సాగుతోంది. మొదటి రోజా 72 కోట్లు తన ఖాతాలో వేసుకొని జవాన్ ని పక్కకు నెట్టేసాడు పుష్పరాజ్.
ఇక రెండో రోజు ఏకంగా 59 కోట్లు కొల్లగొట్టి హిందీ బడా హీరోలకు భారీ షాక్ ను ఇచ్చాడు.. మూడు రోజుల లోగా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రాబోయే చిత్రాలకు గట్టి పొట్టి ని ఇస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్ల లెక్కలు తీసుకుంటే పుష్ప 2 చిత్రం ఎప్పటి వరకు 600 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. ఆదివారం అన్నిచోట్ల మరొకసారి రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. ఊరా అమెరికాగా ఆదివారం ముగిసే సమయానికి ఈ మూవీ 700 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుస్తోంది.
నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రానికి కాస్త స్పీడు తక్కువగా ఉన్నప్పటికీ.. టికెట్ల అధిక రేట్లు కారణంగా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. ఇటు కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో కూడా ఈ మూవీ బాగానే వస్తువులు రాబడుతోంది. ఇక సోమవారం నుంచి ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రానికి సంబంధించిన రేట్లు మామూలు కి వస్తాయి. ఈవారం వీకెండ్ గర్చే సమయానికి మరొక 300 కోట్లు ఈ మూవీ తన ఖాతాలో వేసుకుంటే వారంలో 1000 కోట్లు దాటిన రికార్డు సెట్ చేస్తుంది.
పుష్పరాజ్ ఈ రికార్డు నెలకొల్ప గలిగితే మాత్రం ఇండియన్ హిస్టరీలోనే ఈ చిత్రం నిలిచిపోతుంది అనడంలో డౌట్ లేదు. పుష్ప 2 విడుదలైన వారం రోజులలో 1000 కోట్ల మార్క్ క్రాస్ చేస్తుందని బన్నీ అభిమానులు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.. మరి పుష్ప రాజ్ ఈ టార్గెట్ ను దాటేస్తాడా లేదా చూడాలి.