ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో సాయి పల్లవి ఫుల్ బిజీగా ఉంది. అమ్మడి చేతుల్లో వరుస సినిమాలు ఉండడంతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. రీసెంట్గా శివ కార్తికేయన్ అమరన్ చిత్రంతో భారీ సక్సెస్ అందుకోవడంతో పాటు.. మరొకసారి ఈ తన టాలెంట్ ఎలాంటిదో ప్రూవ్ చేసుకుంది సాయి పల్లవి. దివంగత మేజర్ ముకుంద వరదరాజన్ భార్యగా సాయి పల్లవి నటన అందరిని ఫిదా చేసింది. మరొకసారి తన నాచురల్ యాక్టింగ్ రేంజ్ ఏంటో ఈ మూవీలో చూపించిన సాయి పల్లవి ఈసారి సీతగా మన ముందుకు రావడానికి రెడీ అవుతుంది.
మరోపక్క నాగచైతన్య తండేల్ సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్గా చేస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూవీ భారీ విజయాన్ని అందుకుంది.. దీంతో ఫిబ్రవరి 7న విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన సాయి పల్లవి లుక్స్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రంలో ఓ డి గ్లామర్ పాత్రలో కూడా సాయి పల్లవి అద్భుతంగా కనిపిస్తుంది. మరోపక్క ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ రామాయణం చిత్రంలో సీతగా సాయి పల్లవి లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రంలో నటించడం కోసం ఆమె తన అలవాట్లను మార్చుకుంది అని తాజాగా ఓ మీడియా సంస్థ తన వార్తల్లో ప్రచురించింది.
అను నటించే ప్రతి సినిమాలో క్యారెక్టర్ కి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే సాయి పల్లవి సీత క్యారెక్టర్ కోసం సాత్వికంగా మారిపోయిందట. ఈ సినిమాలో నటిస్తున్నందుకు మాంసాహారాన్ని మానివేసిందని.. విదేశాలకు వెళ్ళినప్పుడు వంట వాళ్లను తీసుకువెళ్లి మరి ప్రత్యేకంగా శాఖాహారమే వండించుకొని తింటుందని ఆ కథనంలో వెల్లడించారు. అయితే దీనిపై చాలా సీరియస్ గా స్పందించిన సాయి పల్లవి.. ఓ గెట్టి వార్నింగ్ ఇచ్చేసింది.
అనవసరంగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా పోస్టులు పెట్టడంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించింది. ఎవ్వరైనా సరే లీగల్ యాక్షన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఇప్పటివరకు తనపై ఎన్నో రూమర్స్ వచ్చిన తాను సైలెంట్ గా ఉన్నానని.. అయితే ఇక రెస్పాండ్ అవ్వాల్సిన టైం వచ్చేసిందని సాయి పల్లవి గట్టిగా చెప్పింది. తనపై ఎటువంటి నిరాధారమైన వార్త ప్రచురించిన ఇకపై ఊరుకునేది లేదని.. ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతుంది.